Breaking News

టీమిండియాలోకి కొత్త కుర్రాడు.. ఎవరీ మానవ్‌ సుతార్‌?

Published on Sat, 06/06/2026 - 12:50

టీమిండియా త‌ర‌పున‌ మ‌రో యువ ఆట‌గాడు క్రికెట్ ప్ర‌పంచానికి ప‌రిచ‌యమ‌య్యాడు. ముల్లాన్‌పూర్ వేదిక‌గా అఫ్గానిస్తాన్‌తో జ‌రుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ అయిన‌ మాన‌వ్ సుతార్ అరంగేట్రం చేశాడు. భార‌త టెస్ట్ క్యాప్‌ను అందుకున్న 319వ ప్లేయ‌ర్‌గా సుతార్ నిలిచాడు.

వాస్త‌వానికి హ‌ర్ష్ దూబేకు తుది జ‌ట్టులో ఆడే అవ‌కాశ‌ముస్తుంద‌ని అంతా భావించారు. కానీ మేనెజ్‌మెంట్ మాత్రం సుతార్ వైపు మొగ్గు చూపింది. దీంతో ఎవ‌రి మాన‌వ్ సుతార్ నెటిజ‌న్లు తెగ‌వేతికేస్తున్నారు.

ఎవరీ మాన‌వ్ సుతార్‌?
అత‌డి పూర్తి పేరు.. మానవ్ జగదుసకుమార్ సుతార్. 23 ఏళ్ల ఈ యువ ఆటగాడు ఆగస్టు 3, 2002న రాజస్థాన్‌లోని శ్రీ గంగనగర్‌లో జన్మించాడు.  త‌న చిన్న‌త‌నం క్రికెటర్ అయ్యేందుకు తీవ్రంగా శ్ర‌మించాడు. మాన‌వ్ శ్రీ గంగానగర్ జిల్లా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి అండర్-14, అండర్-16 టైటిళ్లను అందించాడు. 

ఆ త‌ర్వాత అత‌డు రాజ‌స్తాన్ అండ‌ర్‌-16, అండ‌ర్‌-19, అండ‌ర్‌-23 జ‌ట్ల‌కు ప్రాతినిథ్యం వ‌హించాడు. అక్క‌డ కూడా అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచ‌డంతో రాజ‌స్తాన్ త‌ర‌పున ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్ ఆడే అవ‌కాశం మాన‌వ్‌కు ల‌భించింది. 2022 రంజీ సీజ‌న్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌పై త‌న ఫ‌స్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. త‌న అరంగేట్ర రంజీ సీజ‌న్‌లోనే సుతార్ దుమ్ములేపాడు. 

త‌న స్పిన్ మాయాజాలంతో ప్ర‌త్య‌ర్ధుల‌కు చుక్క‌లు చూపించాడు. కేవ‌లం 6 మ్యాచ్‌ల‌లోనే 39 వికెట్లు ప‌డ‌గొట్టి రాజ‌స్తాన్ త‌ర‌పున లీడింగ్ వికెట్ టేక‌ర్‌గా నిలిచాడు. తొలి 8 ఫ‌స్ట్ క్లాస్ మ్యాచ్‌లలో అత‌డు ఏకంగా 44 వికెట్లు సాధించి అంద‌రి దృష్టిని ఆకర్షించాడు. మొత్తంగా ఇప్పటివరకు 29 రెడ్‌బాల్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడిన సుతార్‌.. 2.94 ఏకానమీ రేట్‌తో 129 వికెట్లు సాధించాడు. 

ఇందులో ఆరు ఫైవ్ వికెట్ల హాల్స్ ఉన్నాయి. 8/33 అతడి అత్యుత్తమ గణాంకాల‌గా ఉన్నాయి. ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్న‌ర్‌కు బ్యాట్‌తో కూడా రాణించే స‌త్తా ఉంది. అత‌డి పేరిట ఓ ఫ‌స్ట్‌క్లాస్ సెంచ‌రీతో పాటు 6 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. ఈ ప్రదర్శనల కారణంగానే అతడిని జాతీయ జట్టుకు సెలక్టర్లు ఎంపిక చేశారు.

స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు ప్రత్నామ్యాయంగా అతడిని జట్టులోకి తీసుకున్నట్లు సమాచారం.  ఇప్పటికే ఇండియా-ఎ తరపున కూడా మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేశాడు. ఇప్పుడు తన అరంగేట్ర మ్యాచ్‌లో సీనియర్ జట్టు తరపున ఎలా రాణిస్తాడో చూడాలి. కాగా 12 ఏళ్ల తర్వాత రాజస్తాన్ నుంచి భారత టెస్ట్ జట్టుకు ఎంపికైన తొలి ప్లేయర్‌గా సుతార్ నిలిచాడు. అదేవిధంగా ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు అతడు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
చదవండి: మీకు దండం పెడతా? కోపంతో ఊగిపోయిన వైభ‌వ్ సూర్య‌వంశీ

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)