Breaking News

పంజాబ్‌ ఓడినా తాను గెలిచాడు.. ఎవరీ అథర్వ తైదే?

Published on Fri, 04/28/2023 - 23:28

లక్నో సూపర్‌ జెయింట్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ మ్యాచ్‌ ద్వారా ఐపీఎల్‌లో మరో సంచలనం పుట్టుకొచ్చాడు. మ్యాచ్‌లో పంజాబ్‌ ఓడినప్పటికి తాను మాత్రం గెలిచాడు. కొండంత లక్ష్యం కనబడుతున్నా ఏ మాత్రం బెదరక ఇన్నింగ్స్‌ ఆడిన తీరు అద్భుతమని చెప్పొచ్చు. అతనే అథర్వ తైదే.

23 ఏళ్ల తైదే పంజాబ్‌ కింగ్స్‌ తరపున ఐపీఎల్‌లో తొలి అర్థసెంచరీ సాధించాడు. 33 బంతుల్లో 66 పరుగులు చేసిన తైదే.. 26 బంతుల్లో ఫిఫ్టీ మార్క్‌ అందుకున్నాడు. అతని ఇన్నింగ్స్‌లో  8 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే 258 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ కింగ్స్‌ 19.5 ఓవర్లలో  201 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీంతో లక్నో 56 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.

ఎవరీ అథర్వ తైదే?
మహారాష్ట్రలోని అకోలా ప్రాంతానికి చెందిన అథర్వ తైదే 2018-19సీజన్‌లో విజయ్‌ హజారే ట్రోఫీ ద్వారా లిస్ట్‌- ఏ క్రికెట్‌లో విదర్భ తరపున అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత రంజీ ట్రోఫీ ద్వారా ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లోనూ అడుగుపెట్టాడు. ఇక 2019 సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ ద్వారా టి20 క్రికెట్‌లో అడుగుపెట్టాడు. 2022లో జరిగిన ఐపీఎల్‌ మెగావేలంలో పంజాబ్‌ కింగ్స్‌ అథర్వ తైదేను కొనుగోలు చేసింది. 15 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 887 పరుగులు, 24 లిస్ట్‌-ఏ మ్యాచ్‌ల్లో 758 పరుగులతో పాటు 8 వికెట్లు, 33 టి20 మ్యాచ్‌ల్లో 774 పరుగులతో పాటు 10 వికెట్లు తీశాడు.

చదవండి: లక్నో సూపర్‌ జెయింట్స్‌ది రికార్డే..  ఆర్‌సీబీని మాత్రం కొట్టలేకపోయింది

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)