వాళ్లిద్దరు రిటైర్‌ అయితే వన్డే క్రికెట్‌ ఏమైపోతుందో!

Published on Fri, 01/02/2026 - 10:05

వన్డే క్రికెట్‌ రారాజుగా వెలుగొందుతున్నాడు భారత బ్యాటింగ్‌ దిగ్గజం విరాట్‌ కోహ్లి. ఇప్పటికే యాభై ఓవర్ల ఫార్మాట్లో 53 సెంచరీలు చేసిన ఈ ఢిల్లీ స్టార్‌... పరుగుల వేట కొనసాగిస్తూనే ఉన్నాడు. మరోవైపు.. టీమిండియా లెజెండరీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma). వన్డేల్లో మూడు డబుల్‌ సెంచరీలు చేయడంతో పాటు.. అత్యధిక స్కోరు (264) రికార్డును కూడా తన పేరిటే లిఖించుకున్నాడు.

వన్డే వరల్డ్‌కప్‌-2023లో టీమిండియాను ఫైనల్‌కు చేర్చిన రోహిత్‌ శర్మ.. ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో జట్టును చాంపియన్‌గా నిలిపాడు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో శతక్కొట్టిన ఈ ముంబైకర్‌.. స్వదేశంలో సౌతాఫ్రికాతో సిరీస్‌లోనూ ఫామ్‌ను కొనసాగించాడు.

 దేశీ మ్యాచ్‌లకు భారీ క్రేజ్‌ 
ఇలా వన్డే క్రికెట్‌లో తమదైన ముద్ర వేసిన రో-కో.. బీసీసీఐ ఆదేశాల మేరకు దేశీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ బరిలోనూ దిగారు. ఢిల్లీ తరఫున కోహ్లి (Virat Kohli).. ముంబైకి ఆడుతూ రోహిత్‌ మరోసారి శతకాలతో చెలరేగారు. వీరిని చూసేందుకు ప్రేక్షకులు ఎగబడ్డారు. ఎన్నడూలేని విధంగా ఈ దేశీ మ్యాచ్‌లకు భారీ క్రేజ్‌ ఏర్పడింది.

ఇక ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించిన రో-కో.. వన్డే వరల్డ్‌కప్‌-2027 తర్వాత యాభై ఓవర్ల ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పే అవకాశం ఉంది.​ ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి కెప్టెన్సీలోనూ ఆడిన భారత స్పిన్‌ దిగ్గజం రవిచంద్రన్‌ అశ్విన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

వాళ్లిద్దరు రిటైర్‌ అయితే వన్డే క్రికెట్‌ ఏమైపోతుందో!
‘‘రోహిత్‌, విరాట్‌.. విజయ్‌ హజారే ట్రోఫీ టోర్నీ ఆడేందుకు రాగానే ప్రేక్షకులు ఈ మ్యాచ్‌లను చూడటం కూడా మొదలుపెట్టారు. అన్నింటికంటే ఆటే గొప్పది. అయితే, రో-కో వంటి ఆటగాళ్లు మాత్రం తమ వల్ల ఆటకు మరింత వన్నె తెచ్చారు.

దేశీ వన్డేలను కూడా క్రికెట్‌ ప్రేమికులు ఫాలో అవుతున్నారంటే అందుకు వీరిద్దరే కారణం. ఒకవేళ రోహిత్‌, విరాట్‌ గనుక వన్డేలు ఆడటం మానేస్తే.. పరిస్థితి ఏమైపోతుందో!’’ అని అశ్విన్‌ విచారం వ్యక్తం చేశాడు. వన్డే ఫార్మాట్‌కు క్రేజ్‌ తగ్గకుండా ఉండేలా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి చర్యలు చేపట్టాలని అశూ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశాడు.

చదవండి: పాకిస్తాన్‌ నుంచి వచ్చిన వాడిని.. ఇక్కడ ఇలా: ఉస్మాన్‌ ఖవాజా

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)