Breaking News

T20 World Cup 2024: ఇలా జరిగితే ఫైనల్స్‌కు టీమిండియా..!

Published on Wed, 06/26/2024 - 11:40

టీ20 వరల్డ్‌కప్‌ 2024లో భాగంగా గయానా వేదికగా రేపు (భారతకాలమానం ప్రకారం​ రాత్రి 8 గంటలకు) జరగాల్సిన భారత్‌-ఇంగ్లండ్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌కు వరుణ గండం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మ్యాచ్‌ జరిగే సమయానికి 88 శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నాయని వెదర్‌ ఫోర్‌క్యాస్ట్‌ పేర్కొంది. ఈ నేపథ్యంలో రేపటి మ్యాచ్‌ రద్దైతే పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.

పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే పరిస్థితి ఏంటి..?
షెడ్యూల్‌ ప్రకారం భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య జరిగే రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌కు రిజర్వ్‌ డే లేదు. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్‌ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే (ఒ‍క్క బంతి కూడా పడకుండా) సూపర్‌-8 దశలో గ్రూప్‌ (గ్రూప్‌-1) టాపర్‌గా ఉన్న కారణంగా టీమిండియా ఫైనల్‌ చేరుతుంది.

ఒకవేళ భారత్‌-ఇంగ్లండ్‌ సెమీస్‌ మ్యాచ్‌కు వర్షం​ కారణంగా పాక్షికంగా అంతరాయం కలిగితే.. ఫలితం తేలేందుకు 250 నిమిషాల అదనపు సమయం ఉంటుంది. ఇక్కడ కూడా ఫలితం తేలకపోతే డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో ఫలితాన్ని నిర్దారిస్తారు.

తొలి సెమీఫైనల్‌కు రిజర్వ్‌ డే
మరోవైపు సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్‌ మధ్య ట్రినిడాడ్‌ వేదికగా రేపు ఉదయం 6 గంటలకు ప్రారంభంకావాల్సిన తొలి సెమీఫైనల్‌ మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు రిజర్వ్‌ డే ఉండటంతో వంద శాతం ఫలితం తేలే అవకాశం ఉంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)