Breaking News

చైనాలో మెస్సీకి చేదు అనుభవం.. కారణం?

Published on Tue, 06/13/2023 - 17:04

అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్‌ లియోనల్‌ మెస్సీకి చైనాలో చేదు అనుభవం ఎదురైంది. పాస్‌పోర్ట్‌ విషయంలో జరిగిన చిన్న పొరపాటు కారణంగా బీజింగ్‌ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు మెస్సీని అడ్డుకోవడం ఆందోళన కలిగించింది. విషయంలోకి వెళితే.. ఈ గురువారం(జూన్‌ 15న) బీజింగ్‌ వేదికగా ఆస్ట్రేలియాతో అర్జెంటీనా అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్‌ ఆడనుంది. ఈ మ్యాచ్‌ కోసం జూన్‌ 10న మెస్సీ చైనాలోని బీజింగ్‌ ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టాడు.
 
అయితే పాస్‌పోర్ట్‌ చెక్‌ చేసిన పోలీసులు మెస్సీని అడ్డుకున్నారు. మెస్సీకి చైనా వీసా లేదని, అప్లై కూడా చేసుకోలేదని వివరించారు. అయితే తన దగ్గరున్న స్పానిష్‌, అర్జెంటీనా పాస్‌పోర్టును అందజేసిన మెస్సీ.. తైవాన్‌లాగే చైనాలో కూడా తనకు ఫ్రీ ఎంట్రీ ఉంటుందని భావించానని తెలిపాడు. కానీ చైనాలోకి రావాలంటే వీసా ఉండాల్సిందేనని, వెంటనే అప్లై చేసుకోవాలని.. తైవాన్ రూల్‌ వర్తించదని పోలీసులు వెల్లడించారు. అయితే అధికారులు చొరవ తీసుకొని అప్పటికప్పుడు ఎమర్జెన్సీ కింద వీసా అందించి సమస్యను పరిష్కరించారు. దీంతో పోలీసులకు మెస్సీ కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా జూన్‌ 15న ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ అనంతరం జట్టుతో కలిసి ఇండోనేషియా వెళ్లనున్న మెస్సీ జూన్‌ 19న ఇండోనేషియాతో ఫ్రెండ్లీ మ్యాచ్‌ ఆడనున్నాడు. ఇక గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అన్నీ తానై జట్టును నడిపించిన మెస్సీ ఏడు గోల్స్‌తో గోల్డెన్‌ బాల్‌ అవార్డు కూడా అందుకున్నాడు. 36 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ అర్జెంటీనా మూడోసారి వరల్డ్‌కప్‌ గెలవడంలో మెస్సీ కీలకపాత్ర పోషించాడు.

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు