Breaking News

భారత్‌- బంగ్లా టెస్టుకు వర్షం అడ్డంకి.. మూడో రోజు ఆట కూడా డౌటే?

Published on Sun, 09/29/2024 - 10:21

కాన్పూర్ వేదిక‌గా భార‌త్‌-బంగ్లాదేశ్ మ‌ధ్య జ‌రుగుతున్న రెండో టెస్టును వ‌రుణుడు  వెంటాడుతూనే ఉన్నాడు. వ‌ర్షం కార‌ణంగా మూడో రోజు ఆట కూడా ప్రారంభం కాలేదు. శ‌నివారం రాత్రి కురిసిన భారీ వ‌ర్షానికి గ్రీన్ పార్క్‌ మైదానం ఔట్ ఫీల్డ్ చిత్త‌డిగా మారింది.

అయితే ప్ర‌స్తుతం కాన్పూర్‌లో వ‌ర్షం కుర‌వ‌డం లేదు. దీంతో మైదానాన్ని సిద్దం చేసే ప‌నిలో గ్రౌండ్ స్టాప్ పడ్డారు. గ్రీన్ పార్క్ స్టేడియంలో మెరుగైన డ్రైనజీ వ్యవస్ధ లేకపోవడంతో గ్రౌండ్‌ను రెడీ చేసేందుకు సిబ్బందికి కష్టతరం అవుతోంది. ఆదివారం మధ్యాహ్నం 12:00 గంటలకు అంపైర్‌లు పిచ్‌ను పరిశీలించనున్నారు. 

కాగా ఇప్పటికే రెండో రోజు(శనివారం) ఆట కనీసం బంతి పడకుండానే రద్దు అయింది. ఇప్పుడు మూడో రోజు ఆటకు కూడా భారీ వర్షం ముప్పు పొంచి ఉంది. మళ్లీ వర్షం ఏమైనా తిరుగుముఖం పడితే మూడో రోజు ఆట కూడా రద్దు అయ్యే అవకాశముంది. కాగా బంగ్లా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

భారత్‌ వర్సెస్‌ బంగ్లాదేశ్‌ రెండో టెస్టు తుదిజట్లు
టీమిండియా
యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్‌), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్‌ పంత్(వికెట్ కీపర్‌), కేఎల్‌ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్‌ దీప్, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్ సిరాజ్
బంగ్లాదేశ్
షాద్‌మన్‌ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్‌), మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్(వికెట్‌కీపర్‌), మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, హసన్ మహమూద్, ఖలీద్ అహ్మద్.

Videos

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)