Breaking News

భారత్‌తో టెస్ట్‌ సిరీస్‌కు ముందు విండీస్‌కు భారీ ఎదురుదెబ్బ

Published on Fri, 09/26/2025 - 19:26

అక్టోబర్‌ 2 నుంచి భారత్‌తో జరుగబోయే రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌కు (India vs West Indies) ముందు వెస్టిండీస్‌ జట్టుకు (West Indies) భారీ ఎదురుదెబ్బ తగిలింది. యంగ్‌ స్పీడ్‌ గన్‌ షమార్‌ జోసఫ్‌ (Shamar Joseph) గాయం​ కారణంగా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. 

అతని స్థానంలో 22 ఏళ్ల బార్బడోస్‌ ఆల్‌రౌండర్‌ జోహాన్‌ లేన్‌ను (Johann Layne) ఎంపిక చేశారు విండీస్‌ సెలెక్టర్లు. ఈ విషయాన్ని సోషల్‌మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. జోసఫ్‌ గాయం వివరాలు వెల్లడించనప్పటికీ.. అక్టోబర్ 18 నుంచి బంగ్లాదేశ్‌తో ప్రారంభంకాబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌కు ముందు అతని పేరు మరోసారి పరిశీలిస్తామని తెలిపారు. ఆ సిరీస్‌లో 3 వన్డేలు, 3 టీ20లు జరుగుతాయి.

26 ఏళ్ల షమార్‌ జోసఫ్‌ ఇటీవలికాలంలో విండీస్‌ కీలక బౌలర్‌గా ఎదిగాడు. 2024లో టెస్ట్ అరంగేట్రం చేసి, ఆస్ట్రేలియాతో జరిగిన ఆ మ్యాచ్‌లో 7 వికెట్లు తీసి అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు. షమార్‌ యార్కర్లు, బౌన్సర్లు, అనూహ్య లైన్ అండ్‌ లెంగ్త్ అతన్ని ఒక్కసారిగా స్టార్‌గా మార్చాయి. అతని అరంగేట్రం బౌలింగ్ స్పెల్‌ను "ఫైర్ అండ్ ఫోకస్" అని విశ్లేషకులు అభివర్ణించారు.

షమార్‌ ఇప్పటివరకు విండీస్‌ తరఫున 11 టెస్ట్‌లు, 6 వన్డేలు, 12 టీ20లు ఆడాడు. ఇందులో మొత్తంగా 70 వికెట్లు తీశాడు. టెస్ట్‌ల్లో షమార్‌ పేరిట 4 ఐదు వికెట్ల ఘనతలు ఉన్నాయి.

షమార్‌ స్థానంలో భారత పర్యటనకు ఎంపికైన జోహాన్ లేన్‌ విషయానికొస్తే.. లేన్ బార్బడోస్‌కు చెందిన పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్. ఇప్పటివరకు 19 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అతను.. 32 ఇన్నింగ్స్‌లో​ 2 హాఫ్‌ సెంచరీల సాయంతో 495 పరుగులు చేశాడు. అలాగే బౌలింగ్‌లో 66 వికెట్లు తీశాడు. ప్రస్తుతం లేన్‌ బౌలింగ్ ఫామ్‌ను దృష్టిలో పెట్టుకుని వెస్టిండీస్ సెలెక్టర్లు అతన్ని భారత పర్యటనకు ఎంపిక చేశారు. 

చదవండి: Asia cup 2025: పాకిస్తాన్‌ ఆటగాళ్ల ఓవరాక్షన్‌పై ఐసీసీ చర్యలు

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)