Breaking News

వెస్టిండీస్‌కు భారీ షాక్‌.. ఎగిరి గంతేస్తున్న పాకిస్తాన్‌!

Published on Fri, 07/24/2026 - 15:35

స్వ‌దేశంలో పాకిస్తాన్‌తో జ‌ర‌గ‌నున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు రోస్టన్ ఛేజ్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, జోమెల్ వారియోకన్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.

దేశ‌వాళీ క్రికెట్‌లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్న లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ స్పిన్నర్ జోషువా బిషప్ తొలిసారిగా విండీస్ టెస్ట్ జ‌ట్టులో చోటు ద‌క్కించుకున్నాడు. 26 ఏళ్ల బిష‌ప్ గడిచిన మూడు వెస్టిండీస్ ఛాంపియన్‌షిప్ సీజన్లలో ఏకంగా 91 వికెట్లు ప‌డ‌గొట్టి స‌త్తాచాటాడు. ఈ క్ర‌మంలోనే అత‌డికి సెల‌క్ట‌ర్లు పిలుపునిచ్చారు.

గడిచిన మూడు వెస్టిండీస్ ఛాంపియన్‌షిప్ సీజన్లలో ఈయన 91 వికెట్లు తీసి అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు. 
డొమెస్టిక్ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేసిన లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ స్పిన్నర్ జోషువా బిషప్ తొలిసారిగా విండీస్ టెస్టు జట్టులోకి పిలుపు అందుకున్నాడు. అదేవిధంగా న్యూజిలాండ్‌తో జ‌రిగిన వ‌న్డే సిరీస్‌లో తొడకండరాల గాయానికి గురైన ఓపెనర్ జాన్ కాంప్‌బెల్.. పాక్‌తో టెస్ట్‌ల‌కు దూర‌మ‌య్యాడు.

అత‌డి స్ధానంలో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కిర్క్ మెకెంజీకి సెల‌క్ట‌ర్లు అవ‌కాశ‌మిచ్చారు. మ‌రోవైపు స్టార్ పేస‌ర్ అల్జారీ జోసెఫ్ వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో ఈ సిరీస్‌కు దూర‌మ‌య్యాడు. ఇది నిజంగా క‌రేబియ‌న్ జ‌ట్టుకు గ‌ట్టి ఎదురు దెబ్బే అనే చెప్పాలి. జోషఫ్‌ వంటి స్టార్‌ బౌలర్‌ జట్టులో లేకపోవడంతో విండీస్‌ గడ్డపై పాక్‌ బ్యాటర్లు పండగ చేసుకోనున్నారు.

కాగా ఆల్‌రౌండ‌ర్ కిమో పాల్ తిరిగి జ‌ట్టులోకి వ‌చ్చాడు. కేమర్ రోచ్, జేడెన్ సీల్స్, షమర్ జోసెఫ్‌లు ఫాస్ట్ బౌల‌ర్ల‌గా ఉన్నారు. ఈ సిరీస్‌లోని మొదటి టెస్టు మ్యాచ్ జూలై 25 నుంచి 29 వరకు టారోబాలోని 'బ్రియన్ లారా క్రికెట్ అకాడమీ' మైదానంలో జరగనుంది.  ఈ వేదికపై అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ జరగ‌నుండడం ఇదే తొలిసారి కావడం విశేషం.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)