Breaking News

యువరాజ్ ఫెయిల్‌.. వెస్టిండీస్ చేతిలో టీమిండియా ఘోర ఓటమి

Published on Wed, 10/14/2026 - 01:30

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌-2026లో ఇండియా ఛాంపియన్స్ కథ ముగిసింది. మంగళవారం షార్జా వేదికగా వెస్టిండీస్ ఛాంపియన్స్‌తో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది. దీంతో ఇండియా ఛాంపియన్స్ సెమీస్ చేరుకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. 

మొత్తం ఐదు మ్యాచ్‌లు ఆడిన భారత్ కేవలం ఒక్క విజయాన్ని మాత్రమే నమోదు చేసింది. ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 110 పరుగులకే పరిమితమైంది.  

ఓపెనర్లు నమన్ ఓజా (0), అంబటి రాయుడు (0) పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరారు. కెప్టెన్ యువరాజ్ సింగ్ (4) కూడా స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ బాట పట్టాడు. 

రిషి ధావన్ (34 పరుగులు) టాప్ స్కోరర్‌గా నిలవగా, రాబిన్ ఉతప్ప (19), పియూష్ చావ్లా (13) కాస్త పోరాడటంతో భారత జట్టు వంద దాటగలిగింది. వెస్టిండీస్ బౌలర్లలో రయద్ ఎమ్రిట్ 2 వికెట్లు తీయగా, కార్లోస్ బ్రాత్‌వైట్, షెల్డన్ కాట్రెల్, నికితా మిల్లర్, ఫిడేల్ ఎడ్వర్డ్స్ తలా ఒక వికెట్ సాధించారు.  

చాడ్విక్ వాల్టన్ విధ్వంసం
అనంతరం 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని  వెస్టిండీస్ ఛాంపియన్స్ జట్టు 14.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి చేధించింది. విండీస్ ఓపెనర్ చాడ్విక్ వాల్టన్( 43 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 60 పరుగులు) ధనాధన్ బ్యాటింగ్‌తో చెలరేగి చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.   భారత బౌలర్లలో దావల్ కులకర్ణి 2 వికెట్లు పడగొట్టగా, పియూష్ చావ్లా, రిషి ధావన్ తలా ఒక వికెట్ సాధించినా విండీస్ జోరును అడ్డుకోలేకపోయారు.   

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)