Breaking News

ప్రతీకారం తీర్చుకున్న న్యూజిలాండ్‌

Published on Wed, 12/03/2025 - 11:13

క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌ మ్యాచ్‌ హోరాహోరీగా సాగుతోంది. తొలుత విండీస్‌ బౌలర్లు రెచ్చిపోయి కివీస్‌ను 231 పరుగులకే కట్టడి చేయగా.. ఆతర్వాత కివీస్‌ బౌలర్లు విండీస్‌ను 167 పరుగులకే కుప్పకూల్చి ప్రతీకారం తీర్చుకున్నారు. జేకబ్‌ డఫీ ఐదు వికెట్లు తీసి విండీస్‌ను దెబ్బేశాడు. మ్యాట్‌ హెన్రీ 3, ఫౌల్క్స్‌ 2 వికెట్లతో మిగతా పని కానిచ్చేశారు.

తేజ్‌నరైన్‌ చంద్రపాల్‌ (52), షాయ్‌ హోప్‌ (56) అర్ద సెంచరీలతో రాణించడంతో విండీస్‌ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. వీరు కాకుండా ఇమ్లాచ్‌ (14), రోచ్‌ (10 నాటౌట్‌) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. విండీస్‌ ఇన్నింగ్స్‌లో ఏకంగా నలుగురు ఖాతా కూడా తెరవలేకపోయారు.

అంతకుముందు విండీస్‌ బౌలర్లు తలో చేయి వేసి కివీస్‌ను స్వల్ప స్కోర్‌కే కట్టడి చేశారు. కేన్ విలియమ్సన్‌ (52), బ్రేస్‌వెల్‌ (47) ఓ మోస్తరుగా రాణించడంతో ఆ జట్టు గౌరవప్రమైన స్కోర్‌ చేయగలిగింది.

64 పరుగుల కీలక ఆధిక్యంలో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన న్యూజిలాండ్‌.. రెండో రోజు మూడో సెషన్‌ సమయానికి వికెట్‌ నష్టపోకుండా 11 పరుగులు చేసింది. కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌ 10, డెవాన్‌ కాన్వే 1 పరుగుతో క్రీజ్‌లో ఉన్నారు.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)