ఇక్కడ ధోని లేడు: ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ వార్నింగ్‌

Published on Sat, 08/01/2026 - 17:00

ఇంగ్లండ్‌ టెస్టు జట్టు హెడ్‌కోచ్‌గా స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ నియామకంపై మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ స్పందించాడు. ఫ్లెమింగ్‌ మంచి వ్యూహకర్త అని ప్రశంసించిన వాన్‌.. అయితే, మహేంద్ర సింగ్‌ ధోని మాదిరి అతడికి ఇంగ్లండ్‌ జట్టులో ఎవరూ దొరకరని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. 

కాగా ‘బజ్‌బాల్‌’తో టెస్టుల్లో దూకుడు ప్రదర్శించిన బ్రెండన్‌ మెకల్లమ్‌కు ఇంగ్లండ్‌ క్రికెట్‌​ బోర్డు (ECB) ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ రిటైర్మెంట్‌ తర్వాత హెడ్‌కోచ్‌ మెకల్లమ్‌ను కూడా టెస్టు కోచ్‌ బాధ్యతల నుంచి తప్పించింది.

నాలుగేళ్ల కాలానికి
మెకల్లమ్‌ స్థానంలో మరో న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ను హెడ్‌కోచ్‌గా ఎంపిక చేసింది. ఈ ఏడాది నుంచి 2030, సెప్టెంబర్‌వరకు నాలుగేళ్ల కాలానికి అతడిని కోచ్‌గా నియమిస్తున్నట్లు ఈసీబీ ప్రకటించింది. 

కాగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో 18 సీజన్ల పాటు చెన్నై సూపర్‌ కింగ్స్‌కు కోచ్‌గా వ్యవహరించిన ఫ్లెమింగ్‌ ఇటీవలే తప్పుకున్నాడు. ఇప్పుడు తొలిసారిగా అంతర్జాతీయ జట్టుకు కోచ్‌గా కొత్త పాత్రలోకి అడుగు పెడుతున్నాడు.

ఇక్కడ ధోని లేడు
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ ది టెలిగ్రాఫ్‌నకు రాసిన కాలమ్‌లో ఫ్లెమింగ్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఫ్లెమింగ్‌కు మంచి మేనేజర్‌, వ్యూహకర్తగా పేరుంది. అందుకు అతడు అర్హుడు కూడా! ఐపీఎల్‌లో అతడి రికార్డు గొప్పగా ఉంది.

అయితే, ఐపీఎల్‌లో మాదిరి ఇంగ్లండ్‌ క్రికెట్‌లో ఎంఎస్‌ ధోని వంటి కెప్టెన్‌ ఫ్లెమింగ్‌కు దొరకడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ అనే పడవను ధోని నడిపాడు. కోచ్‌గా ఫ్లెమింగ్‌ కూడా తన వంతు పాత్ర పోషించాడు. అక్కడ అతడికి బౌలింగ్‌ కోచ్‌గా ఎరిక్‌ సైమన్స్‌ ఉన్నాడు.

వైట్‌బాల్‌ క్రికెట్‌లో స్వింగ్‌ రాబట్టడంలో అతడు మాస్టర్‌. అందుకే చెన్నై జట్టు బౌలింగ్‌ విభాగం అంతలా రాటుదేలింది. ఒకవేళ ఇంగ్లండ్‌ జట్టు కూడా అలా మారితే మంచిదే. ఏదేమైనా ఇక్కడ మాత్రం ఫ్లెమింగ్‌కు ధోని వంటి కెప్టెన్‌ మాత్రం లేడు’’ అని మైకేల్‌ వాన్‌ ఫ్లెమింగ్‌కు హెచ్చరికలు జారీ చేశాడు. చెన్నై విజయాల్లో ఫ్లెమింగ్‌ కంటే కూడా ధోని పాత్రే ఎక్కువని పరోక్షంగా సెటైర్లు వేశాడు.

అనుభవం ఉంది
కాగా కౌంటీ క్రికెట్‌లో ఆటగాడిగా మిడిలెసెక్స్, యార్క్‌షైర్, నాటింగ్‌హామ్‌ జట్ల తరఫున ఆడిన అనుభవం ఉన్న ఫ్లెమింగ్‌కు ఇంగ్లండ్‌ క్రికెట్‌పై మంచి అవగాహన ఉంది. ప్రస్తుతం ‘హండ్రెడ్‌’ లీగ్‌లో అతడు సదరన్‌ బ్రేవ్‌కు కూడా కోచ్‌గా పని చేస్తున్నాడు. 

ఈ ఏడాది దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌ నుంచి ఫ్లెమింగ్‌ బాధ్యతలు చేపడతాడు. మరోవైపు... ఫ్లెమింగ్‌ ఆత్మీయ స్నేహితుడు, వ్యాపార భాగస్వామి బ్రెండన్‌ మెకల్లమ్‌ ఇంగ్లండ్‌ వన్డే, టీ20 టీమ్‌లకు కోచ్‌గా కొనసాగుతున్నాడు.

చదవండి: మంచి సెలక్షన్‌.. సుందర్‌ కంటే అతడు బెటర్‌

Videos

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)