Breaking News

విరాట్‌- అనుష్క.. మమ్మల్ని కూడా బయటకు పొమ్మన్నారు!

Published on Fri, 09/12/2025 - 15:40

భారత దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి (Virat Kohli)కి ఉన్న అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అద్భుతమైన ఆట తీరుతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ రన్‌మెషీన్‌.. వర్ధమాన క్రికెటర్లకు ఆదర్శప్రాయం. ఎంతో మంది యువ ఆటగాళ్లకు అతడొక రోల్‌మోడల్‌.

కోహ్లిని నేరుగా కలిసి బ్యాటింగ్‌ మెళకువలు నేర్చుకోవాలని తహతహలాడే వారెందరో!.. తాము కూడా ఆ కోవకే చెందుతామని చెబుతోంది భారత మహిళా జట్టు స్టార్‌ క్రికెటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ (Jemimah Rodrigues). అయితే, తాను, స్మృతి మంధాన (Smriti Mandhana) చేసిన పని వల్ల విరాట్‌ కోహ్లి, అతడి భార్య అనుష్క శర్మ కాస్త అసౌకర్యానికి గురికావాల్సి వచ్చిందని తాజాగా వెల్లడించింది.

ఒకే హోటల్‌లో బస.. అనుష్క కూడా అక్కడే
‘‘అప్పుడు భారత పురుష, మహిళా క్రికెట్‌ జట్లు న్యూజిలాండ్‌ పర్యటనలో ఉన్నాయి. ఇరుజట్లకు ఒకే హోటల్‌లో బస ఏర్పాటు చేశారు. అప్పుడు స్మృతి, నేను కలిసి విరాట్‌ను కలవాలి అనుకున్నాం.

మీతో మాట్లాడాలనుకుంటున్నాము అనగానే.. ‘ఓహ్‌.. ప్లీజ్‌.. మేము ఇక్కడే కేఫ్‌లో ఉన్నాము వచ్చేయండి’ అని కోహ్లి చెప్పాడు. అప్పుడు అనుష్క శర్మ కూడా అక్కడే ఉంది.

మొదటి అర్ధగంట సేపు క్రికెట్‌ గురించి మాట్లాడాము. ఈ క్రమంలో .. నేను, స్మృతి భారత మహిళా క్రికెట్‌లో కీలక ప్లేయర్లుగా ఉండిపోతామని కోహ్లి అన్నాడు. మేమిద్దరం గొప్ప పేరు తెచ్చుకుంటామని అన్నాడు.

ఇక చాలు.. బయటకు వెళ్లండి
ఆ తర్వాత బ్యాటింగ్‌ గురించి మాకు కొన్ని టిప్స్‌ ఇచ్చాడు. మా మాటలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ తర్వాత వ్యక్తిగత జీవితాల గురించి కూడా మాట్లాడుకున్నాము. ఏదో.. పాత స్నేహితులు చాలా ఏళ్ల తర్వాత కలుసుకున్నట్లుగా మా సంభాషణలు కొనసాగాయి.

అప్పటికి నాలుగు గంటలు గడిచిపోయింది. అప్పుడు కేఫ్‌ నిర్వాహకులు వచ్చి.. ‘సమయం దాటిపోయింది.. ఇక వెళ్లండి’ అని చెప్పేంత వరకు అక్కడే కూర్చున్నాము. సుమారుగా రాత్రి 11.30 గంటల ప్రాంతంలో మేము అక్కడి నుంచి వెళ్లిపోయాము’’ అని జెమీమా రోడ్రిగ్స్‌ గత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంది.

లండన్‌లోనే నివాసం
కాగా బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మను ప్రేమించిన విరాట్‌ కోహ్లి.. 2017లో ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు కుమార్తె వామిక, కుమారుడు అకాయ్‌ సంతానం. 

లండన్‌లో అకాయ్‌కు జన్మనిచ్చిన తర్వాత అనుష్క కోహ్లితో కలిసి అక్కడే ఎక్కువగా ఉంటోంది. మ్యాచ్‌లు ఉన్నపుడు మాత్రమే కోహ్లి భారత్‌కు వస్తున్నాడు. ఇక పెళ్లికి ముందు నుంచే కోహ్లితో పాటు అనుష్క కూడా టీమిండియా వెళ్లే పర్యటనల్లో భాగమయ్యేదన్న విషయం తెలిసిందే.

చదవండి: 21 సార్లు డకౌట్‌ అయినా సరే.. జట్టులోనే.. అతడికి గంభీర్‌ చెప్పిందిదే..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)