Breaking News

WC 2023: మహ్మదుల్లా అరుదైన ఘనత! తొలి బ్యాటర్‌గా రికార్డు! కానీ బుమ్రా దెబ్బకు..

Published on Thu, 10/19/2023 - 18:52

ICC Cricket World Cup 2023- Ind vs Banవన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా టీమిండియాతో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ మహ్మదుల్లా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఈ రైట్‌హ్యాండ్‌ బ్యాటర్‌.. 36 బంతులు ఎదుర్కొని 46 పరుగులు రాబట్టాడు.

బంగ్లాదేశ్‌ మిడిలార్డర్‌ కుప్పకూలిన వేళ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ముష్ఫికర్‌ రహీం(38)తో కలిసి జట్టును ఆదుకున్నాడు. నిర్ణీత 50 ఓవర్లలో బంగ్లాదేశ్‌ 256 పరుగుల మెరుగైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

అదిరే ఆరంభం ఇచ్చిన ఓపెనర్లు
ఇక పుణె వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బంగ్లా ఓపెనర్లు తాంజిద్‌ హసన్‌, లిటన్‌ దాస్‌ అర్ధ శతకాలతో మెరిశారు. 51 పరుగులు సాధించిన తాంజిద్‌ తన అంతర్జాతీయ వన్డే కెరీర్‌లో తొలి హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. అది కూడా టీమిండియా వంటి పటిష్ట జట్టు మీద.. అదీ వరల్డ్‌కప్‌ ఈవెంట్లో!!

మహ్మదుల్లా సరికొత్త చరిత్ర
ఇక లిటన్‌ దాస్‌(66)కు సైతం భారత జట్టు మీద వన్డేల్లో ఇదే తొలి అర్ధ శతకం. ఇలా వీరిద్దరు ఈ మ్యాచ్‌ను ప్రత్యేకంగా మార్చుకోగా.. ఫిఫ్టీకి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయినప్పటికీ మహ్మదుల్లా సరికొత్త చరిత్ర సృష్టించాడు.

అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా మహ్మదుల్లా రికార్డు
టీమిండియాతో మ్యాచ్‌లో మహ్మదుల్లా ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్‌ చరిత్రలో బంగ్లాదేశ్‌ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా మహ్మదుల్లా రికార్డు సాధించాడు.

ఇక భారత జట్టుతో గురువారం నాటి మ్యాచ్‌లో కుల్దీప్‌ యాదవ్‌, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ సిరాజ్‌ బౌలింగ్లో మహ్మదుల్లా సిక్సర్లు బాదాడు. అయితే, ఆఖరి ఓవర్‌ రెండో బంతికి జస్‌ప్రీత్‌ బుమ్రా అద్భుత బంతితో మహ్మదుల్లాను బౌల్డ్‌ చేయడంతో అతడి ఇన్నింగ్స్‌కు తెరపడింది.

ప్రపంచకప్‌ టోర్నీల్లో ఇప్పటి వరకు బంగ్లాదేశ్‌ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్లు వీరే!
1. మహ్మదుల్లా- 16
2. ముష్ఫికర్‌ రహీం- 13
3. షకీబ్‌ అల్‌ హసన్‌- 10.

చదవండి: Hardik Pandya Injury Update: టీమిండియాకు భారీ షాక్‌.. పాండ్యాకు గాయం.. బీసీసీఐ ప్రకటన

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)