Breaking News

అడిలైడ్‌కు చేరుకున్న టీమిండియా.. వైరల్‌ అవుతున్న కోహ్లి ఫొటో

Published on Mon, 10/31/2022 - 16:46

ICC Mens T20 World Cup 2022- India vs Bangladesh- Virat Kohli: టీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీలో టీమిండియా తమ తదుపరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. అడిలైడ్‌ ఓవల్‌ మైదానం వేదికగా సూపర్‌-12లో భాగంగా బుధవారం(నవంబరు 2) షకీబ్‌ అల్‌ హసన్‌ బృందంతో పోటీ పడనుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు సోమవారం పెర్త్‌ నుంచి అడిలైడ్‌కు చేరుకుంది. 

ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో షేర్‌ చేసింది. ఇక అడిలైడ్‌కు చేరే క్రమంలో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ఇన్‌స్టాలో షేర్‌ చేసిన ఫొటో నెటిజన్లను ఆకర్షిస్తోంది. మహ్మద్‌ సిరాజ్‌, యజువేంద్ర చహల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ తదితరులతో ఫొటోకు పోజులిచ్చాడు కింగ్‌. 

వైరల్‌ అవుతున్న కోహ్లి ఫొటో
‘అడిలైడ్‌కు చేరుకున్నాం’ అన్న క్యాప్షన్‌తో కోహ్లి షేర్‌ చేసిన ఈ ఫొటో క్షణాల్లోనే వైరల్‌గా మారింది. గంటలోనే 2 మిలియన్లకు పైగా లైకులతో దూసుకుపోతోంది. ఇక ఈ ఫొటోపై కోహ్లి సతీమణి అనుష్క శర్మ బ్లూ హార్ట్‌ ఎమోజీలతో బదులివ్వగా.. కొంత మంది ఫ్యాన్స్‌ మాత్రం హోటల్‌ రూం లీక్‌ ఘటనను గుర్తు చేస్తూ సలహాలు ఇస్తున్నారు.

‘‘సర్‌ హోటల్‌ గదిని లాక్‌ చేసుకుని వెళ్లండి. ఆటతో పాటు మీ భద్రత కూడా మాకు ముఖ్యమే. దయచేసి జాగ్రత్తగా ఉండండి’’ అంటూ కోహ్లికి విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌ నేపథ్యంలో పెర్త్‌లో బస చేసిన కోహ్లి హోటల్‌ రూం వీడియో లీకైన విషయం విదితమే.

నేరుగా సెమీస్‌ చేరాలంటే!
ఇదిలా ఉంటే.. గ్రూప్‌-2 సూపర్‌-12లో భాగంగా పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌ను మట్టికరిపించిన టీమిండియా.. ఆదివారం సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దీంతో ఎలాంటి సమీకరణాలతో పనిలేకుండా నేరుగా సెమీస్‌ చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌లలో రోహిత్‌ సేన తప్పక విజయం సాధించాలి. బంగ్లాదేశ్‌, జింబాబ్వేలను భారీ తేడాతో ఓడిస్తే నేరుగా సెమీ ఫైనల్లో అడుగుపెట్టడం లాంఛనమే!

చదవండి: Virat Kohli: కోహ్లి రూం వీడియో లీక్‌.. ఇది వాళ్ల పనే! స్పందించిన హోటల్‌ యాజమాన్యం
రాహుల్‌ను తీసేసి.. అతడితో ఓపెనింగ్‌ చేయిస్తే బెటర్‌! మ్యాచ్‌ విన్నర్‌ను పక్కన పెట్టడం ఏంటి?
T20 WC 2022: టీమిండియా మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిస్తేనే! పాక్‌ దింపుడు కల్లం ఆశలు..

Videos

పిడుగురాళ్ల CI వేధింపులకు మహిళ ఆత్మహత్యాయత్నం

చిరు, వెంకీ ఊరమస్ స్టెప్స్..!

ఆపరేషన్ సిందూర సమయంలో భారత్ దెబ్బకు పారిపోయి దాక్కున్నాం

హార్ట్ పేషెంట్స్ ఎవ్వరూ లేరు..! కేటీఆర్ కు పొన్నం కౌంటర్

అల్లాడిపోతున్నది అమ్మ మా అనిత.. పేర్నినాని ఊర మాస్ ర్యాగింగ్

ఎవడబ్బ సొమ్మని మా భూమిలోకి వస్తారు.. మీకు చేతనైతే..

ఒక్క బిడ్ రాలేదు.. జగన్ దెబ్బకు బొమ్మ రివర్స్.. పగతో రగిలిపోతున్న చంద్రబాబు

సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టిన విజయ్

సాక్షి మీడియా గ్రూప్ డైరెక్టర్ దివ్యారెడ్డికి గోల్డ్ మెడల్

టీడీపీ, జనసేన నేతలే ఛీ కొడుతున్నారు.. అయినా మీకు సిగ్గు రాదు

Photos

+5

'జన నాయగణ్' ఈవెంట్ కోసం పూజా రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (డిసెంబర్ 28- జనవరి 04)

+5

బేబీ బంప్‌తో హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

అబుదాబిలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. ఫోటోలు

+5

ప్రభాస్ ది రాజాసాబ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఫ్యాన్స్‌ సందడి.. ఫోటోలు

+5

బీచ్ ఒడ్డున 'కోర్ట్' బ్యూటీ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

మహేశ్ బాబు 'మురారి' క్లైమాక్స్ ఇలా తీశారు (ఫొటోలు)

+5

చీరలో రీసెంట్ ట్రెండింగ్ బ్యూటీ గిరిజ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్‌ కర్ణ్‌ శర్మ (ఫొటోలు)