Breaking News

WC 2022: ఫైనల్లో ఆ జట్లే తలపడాలి.. నా ఓటు కూడా వాళ్లకే: డివిలియర్స్‌

Published on Tue, 11/08/2022 - 14:29

ICC Mens T20 World Cup 2022 - Final Prediction: భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన మేటి జట్లకు వరుణుడి అంతరాయం కారణంగా పరాభవం... సంచలనాలు సృష్టించిన చిన్న జట్లు.. ఆఖరి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపే మ్యాచ్‌లు.. కొంతమందికి ఖేదం.. మరికొంత మందికి మోదం.. ఇలా అనేకానేక భావోద్వేగాలకు కారణమైన టీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీ తుది అంకానికి చేరుకుంది.

విజేతగా నిలిచే క్రమంలో భారత్‌, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌ సెమీ ఫైనల్స్‌కు సిద్దమయ్యాయి. గ్రూప్‌-1 నుంచి కివీస్, ఇంగ్లండ్‌.. గ్రూప్‌-2 నుంచి టీమిండియా, పాక్‌ సెమీ పోరులో నిలిచాయి. ఈ నేపథ్యంలో చాలా మంది క్రికెట్‌ అభిమానులు ఫైనల్‌పై తమ అంచనాలు తెలియజేస్తూ.. ట్రోఫీ కోసం దాయాదులు మరోసారి తలపడితే చూడాలని ఉందంటున్నారు.

నా ఓటు కూడా వాళ్లకే!
దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌ కూడా ఇదే మాట అంటున్నాడు. ఈ మేరకు.. ‘‘ఫైనల్లో పాకిస్తాన్‌/ఇండియా?’’ అవునా? కాదా అంటూ ట్వీట్‌ చేయగా.. దాదాపుగా 77 శాతం మంది అవునని ఓటు వేశారు. ఇందుకు స్పందించిన డివిలియర్స్‌.. ‘‘70 శాతానికి పైగా అవునని ఓటు వేశారు. 

అయితే న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌ కూడా తక్కువేమీ కాదు. ఇరు జట్లు మంచి లైనప్‌ కలిగి ఉన్నాయి. ఫామ్‌లో ఉన్నాయి కూడా! కాబట్టి ఈ సెమీ ఫైనల్స్‌ మరింత ఆసక్తికరంగా మారాయి. ఏదేమైనా నా ఓటు కూడా ఫైనల్లో ఇండియా/పాకిస్తాన్‌ మ్యాచ్‌కే! ఉత్కంఠ రేపే మ్యాచ్‌ కదా’’ అంటూ తాను సైతం ఫైనల్లో చిరకాల ప్రత్యర్థుల పోరును చూడాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు.

కాగా నవంబరు 13న మెల్‌బోర్న్‌లో ఫైనల్‌ మ్యాచ్‌ జరుగనుంది. ఇక టీ20 వరల్డ్‌కప్‌ తొలి ఎడిషన్‌ ఫైనల్లో టీమిండియా- పాక్‌ తలపడగా ధోని సేన విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి అదే రిపీట్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ ఫ్యాన్స్‌ అంచనాలు వేస్తూ మురిసిపోతున్నారు. అయితే, అంతకంటే ముందు ఇరు జట్లు సెమీస్‌లో గెలవాల్సి ఉంటుందని మర్చిపోవద్దు! 

చదవండి: IND VS ENG: వర్షం కారణంగా సెమీస్‌ రద్దయితే.. ఫైనల్‌కు టీమిండియా
Sania Mirza-Shoaib Malik: విడాకులకు సిద్ధమైన సానియా? ‘ఒకే ఒక్క ప్రేమ’ అని ఫరా కామెంట్‌.. ముక్కలైన హృదయం అంటూ..

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)