Breaking News

కేన్‌ మామ 'బకరా' అయ్యే అవకాశాలు ఎక్కువ..

Published on Wed, 02/16/2022 - 10:13

ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ జట్టులో 'హైదరాబాదీ బకరా' అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇటీవలే ముగిసిన వేలంలో ఎస్‌ఆర్‌హెచ్‌ పెద్దగా పేరున్న ఆటగాళ్లను తీసుకోలేదు. ఫామ్‌లో లేని పూరన్‌ కోసం రూ. 10 కోట్లు పెట్టడం అందర్ని ఆశ్చర్యపరిచింది. మరో విండీస్‌ క్రికెటర్‌ రొమారియో షెఫర్డ్‌ కోసం రూ. 7.75 కోట్లు ఖర్చు పెట్టడం ఆసక్తి  కలిగించింది. అయితే ఉ‍న్నంతలో రాహుల్‌ త్రిపాటి, ఎయిడెన్‌ మార్క్రమ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, గ్లెన్‌ పిలిప్స్‌ లాంటి ఆటగాళ్లను కొనుగోలు చేయడం కాస్త ఊరట. అయితే తుది జట్టులో ఎంత మంది ఉంటారో తెలియదు కానీ.. కేన్‌ విలియమ్సన్‌కు బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఎవరిని పంపించాలనే దానిపై ఇబ్బందులు ఎదురుకానున్నాయి. ఈ నేపథ్యంలోనే వసీం జాఫర్‌ కేన్‌ విలియమ్సన్‌ గురించి స్పందించాడు.

చదవండి: IPL 2022: ఆ ఇద్దరే మా ఓపెనర్లు.. క్లారిటీ ఇచ్చిన సన్‌రైజర్స్ కోచ్‌

''ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో కేన్‌ విలియమ్సన్‌ మూడో స్థానంలో ఎక్కువగా వస్తుంటాడు. తాజాగా ఐపీఎల్‌ మెగావేలంలో పూరన్‌, అభిషేక్‌ శర్మ లాంటి ఆటగాళ్లను తీసుకోవడం ద్వారా విలియమ్సన్‌ తన స్థానాన్ని వేరొకరికి ఇచ్చే అవకాశాలు ఉంటాయి. తనకు అచ్చొచ్చిన మూడో స్థానాన్ని వేరొకరికి త్యాగం చేస్తే అది బకరా కిందే లెక్క. అయితే పవర్‌ప్లేలో ఎక్కువ పరుగులు రావాలంటే హిట్టర్లకు చాన్స్‌ ఇవ్వడం మినహాయించి విలియమ్సన్‌కు మరో అవకాశం లేదు. ఇక ఓపెనర్‌గా అభిషేక్‌ శర్మ వస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం. అభిషేక్‌ ఓపెనర్‌గా వస్తే మంచి స్ట్రైకర్‌గా వ్యవహరిస్తాడు. ఇది ఒక మంచి చాయిస్‌ అనే చెప్పొచ్చు'' అని పేర్కొన్నాడు.

చదవండి: IPL 2022 Auction: అందుకే మా ఆయన్ని ఎవరూ కొనలేదు.. స్టార్‌ ఆల్‌రౌండర్ భార్య 

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)