వెస్టిండీస్‌తో తొలి టెస్టు.. టీమిండియాకు ఊహించని షాక్‌

Published on Wed, 10/01/2025 - 14:57

ఆసియాక‌ప్‌-2025 అనంత‌రం తొలి స‌వాల్‌కు టీమిండియా సిద్ద‌మైంది. స్వ‌దేశంలో వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భార‌త్ త‌ల‌ప‌డ‌నుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు అహ్మదాబాద్ వేదిక‌గా అక్టోబ‌ర్ 2 నుంచి ప్రారంభం కానుంది.

ఈ మ్యాచ్‌కు ముందు గిల్ సేన‌కు భారీ షాక్ త‌గిలింది. మంగ‌ళ‌వారం జ‌రిగిన ప్రాక్టీస్ సెష‌న్‌లో స్టార్ ఆల్‌రౌండ‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్ గాయప‌డ్డాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం.. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండ‌గా సుంద‌ర్ చేతి వేలికి గాయ‌మైన‌ట్లు స‌మాచారం.

దీంతో అత‌డు ఫీల్డింగ్ డ్రిల్స్‌కు దూరంగా ఉన్నాడు. గాయం త‌ర్వాత సుంద‌ర్ బౌలింగ్ ప్రాక్టీస్ చేసిన‌ప్ప‌టికి కాస్త అసౌకర్యంగా క‌న్పించిన‌ట్లు స‌ద‌రు రిపోర్ట్ పేర్కొంది. అత‌డి చేతి వేలికి బీసీసీ వైద్య బృందం టేపింగ్ చేశారు.  అయితే అత‌డి గాయం తీవ్ర‌త‌పై ఇప్ప‌టివ‌ర‌కు బీసీసీఐ మాత్రం ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

 కెప్టెన్ గిల్ మాత్రం సుంద‌ర్ వ‌ద్ద‌కు వెళ్లి గాయం తీవ్ర‌త గురుంచి తెలుసుకున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఒకవేళ సుందర్ గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమైతే భారత్‌కు గట్టి ఎదురు దెబ్బే అనే చెప్పాలి. ఈ తమిళనాడు స్పిన్నర్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. 

ఇంగ్లండ్ పర్యటనలో ఆల్‌రౌండ్ షోతో సుందర్ అదరగొట్టాడు. ఇప్పుడు వెస్టిండీస్ సిరీస్‌లో కూడా అతడు టీమిండియాకు కీలకం కానున్నాడు. ఒకవేళ మ్యాచ్ సమయానికి అతడి ఫిట్‌గా లేకపోతే అక్షర్ పటేల్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.

వెస్టిండీస్ సిరీస్‌కు భారత జట్టు
శుబ్‌మన్ గిల్ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్‌), రవీంద్ర జడేజా , వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, ఎన్ జగదీశన్ , మహ్మద్. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్
చదవండి: ట్రోఫీ కావాలంటే నా ఆఫీస్‌కు వచ్చి తీసుకో.. భారత కెప్టెన్‌కు నఖ్వీ షరతు
 

Videos

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)