Breaking News

టీమిండియాకు షాక్‌.. ఫైనల్‌కు ఆల్‌రౌండర్‌ దూరం! లంకకు యువ క్రికెటర్‌..

Published on Sat, 09/16/2023 - 14:58

Asia Cup 2023 Final: ఆసియా కప్‌-2023 ఫైనల్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ గాయం కారణంగా జట్టుకు దూరమైనట్లు తెలుస్తోంది. యువ క్రికెటర్‌ వాషింగ్టన్‌ సుందర్‌తో ఈ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ స్థానాన్ని భర్తీ చేసేందుకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి నిర్ణయించినట్లు సమాచారం.

లంకకు బయల్దేరిన యువ క్రికెటర్‌
ఈ క్రమంలో చెన్నై ఆటగాడు సుందర్‌ ఇప్పటికే శ్రీలంకు బయల్దేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘అక్షర్‌ను గాయాలు వేధిస్తున్నాయి. చిటికిన వేలికి గాయమైంది. ముంజేయికి కూడా దెబ్బతగిలింది. 

వాషీని ఎయిర్‌పోర్టులో చూశానన్న డీకే
అంతేకాదు.. తొడ కండరాలు పట్టేశాయి కూడా. అందుకే వాషింగ్టన్‌ను శ్రీలంకకు పిలిపిస్తున్నారు’’ అని పేర్కొన్నాయి. ఇదిలా ఉంటే.. టీమిండియా వెటరన్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దినేశ్‌ కార్తిక్‌ సైతం సుందర్‌ ప్రయాణం గురించి హింట్‌ ఇచ్చాడు. 

‘‘ఎయిర్‌పోర్టులో అనుకోకుండా.. నాకు వాషింగ్టన్‌ సుందర్‌ తారసపడ్డాడు. అతడికి ఎక్కడికి వెళ్తున్నాడో గెస్‌ చేయండి’’ అని ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేశాడు.​ ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ తర్వాత విలేకరులతో మాట్లాడిన టీమిండియా ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌.. అక్షర్‌ గాయాలు అంత తీవ్రమైనవి కావని పేర్కొనడం గమనార్హం.

బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో అక్షర్‌ పోరాటం
కాగా ఆసియా కప్‌-2023 సూపర్‌-4లో ఆఖరి మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోయిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో చివరి బంతి వరకు ఉత్కంఠ రేపిన శుక్రవారం నాటి మ్యాచ్‌లో అక్షర్‌ పటేల్‌ 34 బంతుల్లో 42 పరుగులతో రాణించాడు.

అంతకుముందు బంగ్లా ఇన్నింగ్స్‌లో 9 ఓవర్ల బౌలింగ్‌లో 47 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ తీశాడు. ఇదిలా ఉంటే.. గాయాల తీవ్రత ఎక్కువైతే మాత్రం వన్డే వరల్డ్‌కప్‌-2023కి కూడా అక్షర్‌ పటేల్‌ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.

వన్డేల్లో సుందర్‌ గణాంకాలు
ఇక యువ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ టీమిండియా తరఫున ఇప్పటి వరకు 16 వన్డేలు ఆడాడు. 16 వికెట్లు తీయడంతో పాటు 233 పరుగులు సాధించాడు. ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్‌తో చివరిగా వన్డే ఆడాడు. కాగా ఆదివారం (సెప్టెంబరు 17) టీమిండియా- శ్రీలంక మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరుగనుంది.

చదవండి: అతడిని కాదని నీకు ఛాన్స్‌.. ‘రాక రాక’ వచ్చిన అవకాశం! ఇకనైనా మారు..

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)