Breaking News

కెప్టెన్‌గా సూర్యా ఏంటి?.. నేనైతే షాకయ్యా: టీమిండియా మాజీ కోచ్‌

Published on Thu, 01/30/2025 - 21:25

ఒకప్పుడు టీమిండియాలో చోటు కోసం పరితపించిపోయిన సూర్యకుమార్‌ యాదవ్‌(Suryakumar Yadav) ఇప్పుడు కెప్టెన్‌ స్థాయికి చేరుకున్నాడు. ముప్పై ఏళ్ల వయసులో అరంగేట్రం చేసిన అతడు.. పొట్టి ఫార్మాట్లో తనను తాను నిరూపించుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాడు. టీ20లో ప్రపంచ నంబర్‌ వన్‌(ICC World No.1 Batter) బ్యాటర్‌గా సత్తా చాటిన అతడు.. మూడేళ్ల వ్యవధిలోనే అనూహ్యంగా భారత జట్టు(Team India T20 Captain) నాయకుడిగా పగ్గాలు చేపట్టాడు.

కెప్టెన్‌గా వరుస విజయాలు
పూర్తిస్థాయి టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శ్రీలంకలో క్లీన్‌స్వీప్‌ విజయం అందుకున్న సూర్య... బంగ్లాదేశ్‌పై కూడా ఇదే ఫలితాన్ని పునరావృతం చేశాడు. యువ జట్టుతో సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లి అక్కడా టీ20 సిరీస్‌ను 3-1తో గెలిచి తనను తాను నిరూపించుకున్నాడు. ప్రస్తుతం సూర్య సారథ్యంలో సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో సిరీస్‌ గెలవడంలో టీమిండియా బిజీగా ఉంది.

ఈ నేపథ్యంలో భారత జట్టు బ్యాటింగ్‌ మాజీ కోచ్‌ సంజయ్‌ బంగర్‌(Sanjay Bangar) సూర్యకుమార్‌ యాదవ్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తక్కువ కాలంలోనే అతడు కెప్టెన్‌ స్థాయికి చేరుకోవడం తనను ఆశ్చర్యపరిచిందని పేర్కొన్నాడు. రోహిత్‌ శర్మ తర్వాత కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యా నియామకం దాదాపు ఖరారైపోయిందన్న తరుణంలో సూర్య సారథిగా ఎంపిక కావడం నిజంగా ఓ షాక్‌ అన్నాడు.

హార్దిక్‌ పాండ్యాకు బదులు సూర్య.. నేనైతే షాకయ్యా
ఈ మేరకు స్టార్‌ స్పోర్ట్స్‌ ‘షో’లో మాట్లాడుతూ.. ‘‘చాలా మంది హార్దిక్‌ పాండ్యానే కాబోయే కెప్టెన్‌ అనుకుంటున్న సమయంలో హఠాత్తుగా సూర్య పేరు బయటకు వచ్చింది. నిజంగా కెప్టెన్‌గా అతడి నియామక ప్రకటన రాగానే.. నేనైతే షాకయ్యా. ఏదేమైనా.. నాయకుడిగా అతడు ఎదిగిన తీరు అద్భుతం.

రోహిత్‌, కోహ్లి, జడేజా రిటైర్మెంట్‌ తర్వాత.. యువకులతో కూడిన జట్టు లభించడం కూడా అతడికి కలిసి వచ్చింది. వాళ్లలో ఒకడిగా ఉంటూనే.. నవతరం నాయకుడిగా సూర్య సరికొత్తగా తనను తాను ఆవిష్కరించుకునే వీలు కలిగింది.

ఇక బ్యాటర్‌గా అతడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు. బౌలర్‌ చేతి నుంచి బంతి వెలువడకముందే.. దానిని అంచనా వేసి అందుకు తగ్గట్లుగా పర్ఫెక్ట్‌ షాట్‌తో రెడీ ఉండటం కొద్దిమందికే సాధ్యమవుతుంది. అందులో సూర్య ఒకడు.

అతడో అద్భుత బ్యాటర్‌
ఆసియా కప్‌ సమయంలో ప్రత్యర్థి జట్టు బౌలర్లు సూర్యను ఎదుర్కొనేందుకు పడ్డ కష్టాలను మేము చూశాం. వాళ్లు ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ఏదో ఒక కొత్త షాట్‌తో బంతిని ఎదుర్కోవడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. 

360 డిగ్రీలలో షాట్లు బాదగల క్రికెటర్లు ఎంతో మంది ఉన్నారు. అయితే, అప్పటికప్పుడు పరిస్థితికి అనుగుణంగా.. తన ప్రణాళికను మార్చుకుని షాట్లు ఆడటంలో దిట్ట. అతడో అద్భుత బ్యాటర్‌’’ అని సంజయ్‌ బంగర్‌ సూర్యను ప్రశంసించాడు.

గొప్ప కెప్టెన్‌ కూడా
మరోవైపు.. ఇదే షోలో భారత మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ మాట్లాడుతూ.. ‘‘కెప్టెన్‌గానూ అతడిలో టెంపర్‌మెంట్‌ సూపర్‌. గొప్ప ఇన్నింగ్స్‌ ఆడిన ప్రతిసారీ మరింత ప్రశాంతంగా.. నిరాడంబరంగా ఉండటం అతడికే చెల్లింది. 

అతడి మనసు మంచిది. టెస్టు కెప్టెన్సీకి బుమ్రా సరైనవాడని ఎలా అనుకుంటున్నామో.. టీ20లకు సూర్య అత్యుత్తమ కెప్టెన్‌ అని ఇప్పటికే రుజువైంది’’ అని సూర్యకుమార్‌ యాదవ్‌ను కొనియాడాడు. 

చదవండి: రెండు వరల్డ్‌కప్‌లు ఆడాడు.. ఇప్పట్లో టీమిండియా రీఎంట్రీ కష్టమే!

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)