Breaking News

వరల్డ్‌కప్ విన్నర్ దీప్తి శర్మకు భారీ షాక్‌..

Published on Thu, 11/06/2025 - 20:33

యూపీ వారియర్జ్ (UP Warriorz) ఫ్రాంచైజీ సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళల ప్రీమియర్ లీగ్‌-2026 మెగా వేలానికి ముందు ఒక్క ప్లేయర్‌నే మాత్రమే రిటైన్ చేసుకుంది. అన్‌క్యాప్డ్ ఇండియన్ బ్యాటర్ శ్వేతా సెహ్రావత్ (Shweta Sehrawat)ను యూపీ అంటిపెట్టుకుంది.

తమ జట్టు కెప్టెన్‌, భారత మహిళల జట్టు స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మను సైతం యూపీ వారియర్జ్ జట్టు నుంచి విడుదల చేసింది. నవంబర్ 27న ఢిల్లీ జరగనున్న వేలంలో దీప్తి పాల్గోనుంది. డబ్ల్యూపీఎల్ తొలి ఎడిష‌న్ నుంచి దీప్తీ శ‌ర్మ యూపీతో కొన‌సాగింది.

ఈ వ‌ర‌ల్డ్‌క‌ప్ విన్న‌ర్‌ను యూపీ ఫ్రాంచైజీ డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ వేలంలో రూ.2.5 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. మూడు సీజన్ల పాటు ఒకే జట్టు ప్రాతినిథ్యం వహించిన దీప్తీ.. ఇప్పుడు వేలంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునుంది. అలిస్సా హీలీ, ఇంగ్లాండ్‌ స్పిన్నర్ సోఫీ ఎక్లెస్టోన్ వంటి కీలక ఆటగాళ్లందరినీ యూపీ వారియర్జ్ రిలీజ్ చేసింది.

యూపీ వారియర్జ్ వద్ద అత్యధికంగా రూ.14.5 కోట్లు పర్స్ బ్యాలెన్స్ ఉంది. అయితే యూపీ వద్ద నాలుగు 'రైట్ టు మ్యాచ్' (RTM) కార్డులు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించి దీప్తి శర్మను లేదా ఇతర స్టార్ ప్లేయర్లను తిరిగి జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.

యూపీ వారియర్స్ రిటైన్ చేసుకున్న ప్లేయర్లు
శ్వేతా సెహ్రావత్‌ (రూ. 50 లక్షలు)

యూపీ వారియర్స్ రిలీజ్ చేసే ప్లేయర్లు వీరే..
ఉమా ఛెత్రి ఆరుషి గోయెల్‌, పూనమ్‌ ఖెన్మార్‌, కిరణ్‌ నవగిరె, దినేశ్‌ వ్రింద, దీప్తి శర్మ, అంజలి శర్వాణి, క్రాంతి గౌడ్‌, రాజేశ్వరి గైక్వాడ్‌, గౌహర్‌ సుల్తానా, సైమా ఠాకూర్‌, చినెల్లి హెన్రి, జార్జియా వాల్‌, అలిసా హేలీ గ్రేస్‌ హ్యారిస్‌, అలనా కింగ్‌, చమరి ఆటపట్టు, తాహిలా మెగ్రాత్‌, సోఫీ ఎక్లిస్టోన్‌.
చదవండి: వారిద్దరూ అద్భుతం.. గంభీర్‌, నేను ఒక్కటే: సూర్య కుమార్‌

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)