Breaking News

అదొక జబ్బు! బయటపడాలని కోరుకుంటున్నా.. కోహ్లి పోస్ట్‌ వైరల్‌

Published on Mon, 01/09/2023 - 13:34

Virat Kohli: ‘‘పేరు ప్రఖ్యాతులు రావాలని కోరుకోవడం కూడా ఓ జబ్బులాంటిదే! అయితే, ఏదో ఒకరోజు నేను ఈ జబ్బు నుంచి బయటపడాలి.. ఈ కోరికల వలయం నుంచి విముక్తి పొందాలని ఆశిస్తున్నా. 

కీర్తిప్రతిష్టలు పెద్ద విషయమేం కాదు. జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించగలుగుతున్నామా లేదా? ఉన్నదాంతో సంతృప్తి పడుతున్నామా లేదా అన్నదే ముఖ్యం’’.. బాలీవుడ్‌ దివంగత నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ ఒకానొక సందర్భంలో చెప్పిన మాటలు ఇవి.

జీవిత పరమార్థాన్ని తెలియజేసే ఈ కోట్‌ను టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి తాజాగా తన ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేశాడు. కాగా అరంగేట్రం చేసిన అనతికాలంలోనే భారత జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగిన కోహ్లి.. సారథిగానూ బాధ్యతలు నిర్వర్తించిన విషయం తెలిసిందే.

ఆటగాడిగా ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో 72 సెంచరీలు పూర్తి చేసుకున్న ఈ రన్‌మెషీన్‌.. కెప్టెన్‌గానూ తనదైన ముద్ర వేయగలిగాడు. ఇక బంగ్లాదేశ్‌ పర్యటన తర్వాత విశ్రాంతి తీసుకున్న కోహ్లి.. శ్రీలంకతో స్వదేశంలో వన్డే సిరీస్‌తో మంగళవారం నాటి తొలి మ్యాచ్‌తో మళ్లీ మైదానంలో దిగనున్నాడు.

ఈ నేపథ్యంలో కోహ్లి ఈ మేరకు ఇర్ఫాన్‌ ఖాన్‌ మాటలు కోట్‌ చేస్తూ పోస్టు పెట్టాడు. అంతేకాదు.. ‘‘ఈ కఠిన సమయం కూడా గడిచిపోతుంది. ఇప్పుడు నీ పరిస్థితి బాగోలేదా? నీ పని అయిపోయిందనిపిస్తోందా? పరిస్థితులపై కోపం వస్తోందా? 

ఇలాంటి గడ్డు పరిస్థితులూ కాలంతో పాటే మారిపోతాయి. నీకెదురైన ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరుకుతుంది. నీకే కాదు నిన్ను విమర్శించిన వాళ్లకూ నువ్వు జవాబు చెప్పినట్లే అవుతుంది’’ అని హాలీవుడ్‌ యాక్టర్‌ టామ్‌ హాంక్స్‌ చెప్పిన స్ఫూర్తిదాయక మాటలను ప్రస్తావించడం విశేషం. కాగా వన్డే సిరీస్‌కు ముందు కోహ్లి ఈ మేరకు పోస్ట్‌ చేయడం నెట్టింట వైరల్‌గా మారింది. కోహ్లి పోస్ట్‌ వెనుక అర్థం ఏమిటంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

చదవండి: Suryakumar Yadav: సూర్య ఇండియన్‌ కాబట్టి సరిపోయింది.. అదే పాకిస్తాన్‌లో ఉంటేనా: పాక్‌ మాజీ కెప్టెన్‌
Suryakumar Yadav: సూర్య కెరీర్‌పై గంభీర్‌ ట్వీట్‌! నీకు అతడు మాత్రమే కనిపిస్తున్నాడా? ఫ్యాన్స్‌ ఫైర్‌

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)