Breaking News

ఆస్ట్రేలియా జట్టుకు ఎంపికైన భారత సంతతి కుర్రాడు

Published on Fri, 08/09/2024 - 15:57

భారత సంతతికి చెందిన విశ్వ రామ్‌కుమార్‌ అనే కుర్రాడు ఆస్ట్రేలియా అండర్‌ 19 క్రికెట్‌ జట్టుకు ఎంపికయ్యాడు. త్వరలో (సెప్టెంబర్‌) భారత్‌లో పర్యటించనున్న ఆస్ట్రేలియా జట్టుకు రామ్‌కుమార్‌ను ఎంపిక చేశారు ఆ దేశ సెలెక్టర్లు. భారత్‌ పర్యటనలో ఆసీస్‌ మూడు 50 ఓవర్ల మ్యాచ్‌లు, రెండు నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడనుంది. 

లెగ్‌ స్పిన్‌ బౌలర్‌ అయిన రామ్‌కుమార్‌ దేశవాలీ సీజన్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేసి ఆసీస్‌ సెలెక్టర్ల దృష్టిని ఆకర్శించాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అండర్‌ 19 వరల్డ్‌కప్‌లో భారత సంతతికి చెందిన మరో ఇద్దరు(హర్జస్‌ సింగ్‌, హర్కీరత్‌ బజ్వా) ఆసీస్‌ జట్టుకు ఎంపికయ్యారు. భారత్‌లో జరిగిన వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఫైనల్లో భారత్‌పై 79 పరుగుల తేడాతో గెలుపొంది టైటిల్‌ ఎగరేసుకుపోయింది.

భారత పర్యటనకు ఆస్ట్రేలియా అండర్‌-19 జట్టు..
థామస్‌ బ్రౌన్‌, సైమన్‌ బడ్జ్‌, జాక్‌ కర్టన్‌, రిలే కింగ్సెల్‌, అలెక్స్‌ లీ యంగ్‌, స్టీవెన్‌ హోగన్‌, లింకన్‌ హాబ్స్‌, హ్యారీ హోయెక్స్‌ట్రా, క్రిస్టియన్‌ హోవ్‌, ఎయిడెన్‌ ఓ కానర్‌, ఓలీ ప్యాటర్సన్‌, ఓలీ పీక్‌, విశ్వ రామ్‌కుమార్‌, లాచ్లన్‌ రనాల్డో, హేడెన్‌ స్కిల్లర్‌, అడిసన్‌ షెరిఫ్‌

Videos

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)