Breaking News

'పంత్‌ను చూసి నేర్చుకోండి'.. ర‌హానేపై సెహ్వాగ్ ఫైర్‌

Published on Mon, 05/26/2025 - 14:14

ఐపీఎల్‌-2025 సీజ‌న్‌ను కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ ఘోర ఓట‌మితో ముగించింది. ఆదివారం ఢిల్లీ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 110 ప‌రుగుల తేడాతో కేకేఆర్ ప‌రాజ‌యం చ‌విచూసింది. ఈ ఏడాది సీజన్ అసాంతం దారుణ ప్ర‌ద‌ర్శ‌న కన‌బ‌రిచిన డిఫెండింగ్ ఛాంపియ‌న్‌.. వ‌రుస ఓట‌ముల‌తో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడంలో విఫ‌ల‌మైంది.

శ్రేయ‌స్ అయ్య‌ర్ స్ధానంలో కెప్టెన్సీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన వెట‌ర‌న్ ఆట‌గాడు అజింక్య ర‌హానే జ‌ట్టును విజ‌యం ప‌థంలో న‌డిపించ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు. వ్య‌క్తిగ‌త ప్ర‌ద‌ర్శ‌న ప‌రంగా ప‌ర్వాలేదన్పించిన‌ప్ప‌టికి, కెప్టెన్‌గా మాత్రం ర‌హానే పూర్తిగా తేలిపోయాడు.

ఈ ఏడాది సీజ‌న్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్ ఐదింట మాత్ర‌మే విజ‌యం సాధించి పాయింట్ల ప‌ట్టిక‌లో ఏడో స్ధానంలో నిలిచింది. ఈ క్ర‌మంలో కేకేఆర్ మెనెజ్‌మెంట్‌పై మాజీ క్రికెట‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ విమ‌ర్శ‌లు గుప్పించాడు. ర‌హానే టాప్‌-3లో బ్యాటింగ్‌కు రావ‌డాన్ని సెహ్వాగ్ త‌ప్పుబ‌ట్టాడు.

"కెప్టెన్ టాప్ త్రీలోనే బ్యాటింగ్ చేయాల‌ని ఎక్క‌డా రాసిలేదు. పంత్‌ను చూసి నేర్చుకోండి. అత‌డు త‌న ఫామ్‌లో లేని అని తెలిసి మిగితా ఆట‌గాళ్లను త‌న‌కంటే ముందు బ్యాటింగ్‌కు పంపుతున్నాడు. ఫామ్‌లో ఉన్న ఆట‌గాళ్లు టాప‌ర్డ‌ర్‌లో బ్యాటింగ్‌కు రావ‌డంతో ల‌క్నో భారీ స్కోర్ సాధించగలుగుతుంది.

కేకేఆర్ అలాగే చేసి ఉంటే బాగుండేది. అది టీమ్ మెనెజ్‌మెంట్‌, కోచింగ్ స్టాప్ బాధ్య‌త‌. నిన్న గుజ‌రాత్‌తో మ్యాచ్‌లో కూడా సీఎస్‌కే అదే ప‌నిచేసింది. ఫామ్‌లో ఉన్న డెవాల్డ్ బ్రెవిస్‌, శివమ్ దూబేల‌ను ముందు బ్యాటింగ్‌కు పంపారు" అని క్రిక్‌బజ్ లైవ్ షో సెహ్వాగ్ పేర్కొన్నాడు.
చదవండి: చెప్పింది వినరా?.. సహనం కోల్పోయిన ధోని.. పతిరణ, దూబేపై ఫైర్‌!

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)