Breaking News

అతడిని ఎందుకు బ్యాటింగ్‌కు పంపారో తెలియదు? లక్నో నిర్ణయంపై సెహ్వాగ్ ఫైర్!

Published on Mon, 05/08/2023 - 21:15

ఐపీఎల్‌-2023లో భాగంగా ఆదివారం గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 56 పరుగుల తేడాతో లక్నో పరాజయం పాలైంది. 228 పరుగల భారీ లక్క్ష్య ఛేదనలో లక్నోకు ఓపెనర్లు డికాక్‌, కైల్‌ మైర్స్‌ అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. అయినప్పటికీ మిడిలార్డర్‌లో బ్యాటర్లు రాణించకపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 171 పరుగులకే లక్నో పరిమితమైంది.

ఇక లక్నో ఓటమిపై టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వాఖ్యలు చేశాడు. లక్నో తీసుకున్న అనాలోచిత నిర్ణయం కారణంగానే పరాజయం పాలైంది అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. దీపక్ హుడాకు బదులుగా మూడో స్థానంలో  ఇన్-ఫామ్ బ్యాటర్‌ను పంపి ఉండాల్సిందని సెహ్వాగ్ తెలిపాడు. "10 ఓవర్లకు లక్నో కేవలం ఒక వికెట్‌ మాత్రమే నష్టపోయి 102 పరుగులతో పటిష్టంగా కన్పించారు.

ఇటువంటి స్థితిలో ఉన్న లక్నో ఇంత భారీ తేడాతో ఓడిపోతుందని అస్సలు ఊహించలేదు. మొదటి వికెట్ తర్వాత ఫామ్‌లో ఉన్న బ్యాటర్ రావల్సింది. పూరన్, మార్కస్ స్టోయినిస్, కెప్టెన్‌ కృనాల్ పాండ్యా వచ్చినా బాగుండేది. అదే విధంగా వారి ఆఖరి మ్యాచ్‌లో చెన్నైపై అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన ఆయుష్ బదోని అయినా పంపాల్సింది. కానీ లక్నో మాత్రం వీరివ్వరూ కాకుండా దీపక్‌ హుడాను బ్యాటింగ్‌కు వచ్చాడు. అస్సలు హుడాను ఎందుకు పంపారో ఆర్ధం కావడం లేదు. అదే వాళ్ల కొంపముంచింది" అని క్రిక్‌బజ్‌తో సెహ్వాగ్ పేర్కొన్నాడు.
చదవండి: WTC FInal 2023: రుత్‌రాజ్‌ గైక్వాడ్‌కు బంపరాఫర్‌.. డబ్ల్యూటీసీ ఫైనల్‌ జట్టులో!

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)