NTR District: YSRCP బ్యానర్లు తొలగించడంపై అసహనం
Breaking News
హార్దిక్‌పై కోపంతో ఊగిపోయిన కోహ్లి.. ఏం జరిగిందంటే? వీడియో వైరల్
Published on Sat, 03/18/2023 - 14:30
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ను టీమిండియా విజయంతో ఆరంభించింది. శుక్రవారం ముంబై వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయ భేరి మోగించింది. ఈ విజయంలో కేఎల్ రాహుల్(75), రవీంద్ర జడేజా(45) కీలక పాత్ర పోషించారు. కాగా ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఫ్రీహిట్ బంతిని ఉపయోగించుకోవడంలో విఫలమైన టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై విరాట్ కోహ్లి సీరియస్ అయ్యాడు.
ఆసీస్ ఇన్నింగ్స్ 18 ఓవర్ వేసిన స్టోయినిస్ బౌలింగ్‌లో హార్దిక్ ఫ్రీ హిట్ లభించింది. ఫ్రీ-హిట్ డెలివరీని ఆడడంలో విఫలమైన హార్దిక్.. కేవలం ఒక్క పరుగు మాత్రమే రాబట్టాడు. అయితే హార్దిక్ షాట్ సెలక్షన్ పట్ల కోహ్లి నిరాశను వ్యక్తం చేశాడు. డ్రెస్సింగ్ రూంలో కూర్చోని ఉన్న కోహ్లి గ్రౌండ్ వైపు చేయి చూపిస్తూ ఏదో అన్నాడు.
కోహ్లి పక్కన కిషన్‌తో పాటు కోచింగ్ స్టాప్ కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో కోహ్లి కేవలం 4పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు హార్దిక్ 25 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే విశాఖ వేదికగా మార్చి19న జరగనుంది.
చదవండి: IND Vs AUS: ఏంటి హార్దిక్ ఇది.. సీనియర్లకు ఇచ్చే విలువ ఇదేనా? పాపం కోహ్లి! వీడియో వైరల్
— Anna 24GhanteChaukanna (@Anna24GhanteCh2) March 17, 2023
— Anna 24GhanteChaukanna (@Anna24GhanteCh2) March 17, 2023
Tags : 1