Breaking News

మణికొండలో సందడి చేసిన విరాట్‌ కోహ్లి..

Published on Thu, 01/19/2023 - 11:58

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి హైదరాబాద్‌లోని మణికొండలో సందడి చేశాడు. మణికొండ గ్రీన్‌ లివింగ్‌ అపార్ట్‌మెంట్‌లోని హైకీ జిమ్‌లో ఓ యాడ్‌ షూటింగ్‌లో కింగ్‌ కోహ్లి పాల్గొన్నాడు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు. దీంతో, ఆ ప్రాంత‌మంతా కిక్కిరిసిపోయింది.

కాగా మణికొండలోని పైపులైను రోడ్డులో గ‌ల హాల్‌మార్క్ హ‌బ్‌లో హైకీ ఫిట్‌నెస్ స్టూడియో ఉంది. ఫిట్‌నెస్‌కు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే కోహ్లి.. అత్యాధునికంగా డిజైన్ చేసిన ఈ జిమ్‌లో దాదాపు రెండు గంట‌ల సేపు సమయం గడిపాడు. ఓ సంస్థకు సంబంధించిన వ్యాపార ప్ర‌క‌ట‌నను ఇక్క‌డే షూట్ చేశారు. షూట్ ముగిసిన త‌ర్వాత హైకీ ఫిట్‌నెస్ స్టూడియోని ఆరంభించిన యంగ్ ఎంట‌ర్‌ప్రెన్యూర్ మ‌నీషాతో కోహ్లి ముచ్చ‌టించాడు. 

కాగా ఉప్పల్‌ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో పాల్గోనేందుకు కోహ్లి భాగ్యనగరానికి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక కివీస్‌తో జరిగిన తొలి వన్డేలో 12 పరుగుల తేడాతో భారత్‌ విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో కోహ్లి 8 పరుగులు మాత్రమే చేశాడు. యువ ఓపెనర్‌ శుబ్‌మాన్‌ గిల్‌ అద్భుతమైన డబుల్‌ సెంచరీతో చెలరేగాడు. గిల్‌ 143 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్స్‌లతో 208 పరుగులు సాధించాడు. ఇక ఇరు జట్ల మధ్య రెండో వన్డే రాయ్‌పూర్‌ వేదికగా జనవరి 21న జరగనుంది.
చదవండి: SA20 2023: రషీద్‌ ఖాన్‌కు చుక్కలు చూపించిన సన్‌రైజర్స్‌ బ్యాటర్‌.. ఒకే ఓవర్‌లో 28 పరుగులు!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)