కోహ్లి, రోహిత్‌ వన్డే వరల్డ్‌కప్‌-2027 ఆడరు: టీమిండియా దిగ్గజం

Published on Tue, 05/13/2025 - 10:34

టీమిండియా దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి (Virat Kohli), కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma)ను ఉద్దేశించి భారత మాజీ సారథి సునిల్‌ గావస్కర్‌ (Sunil Gavaskar) సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ ఇద్దరూ వన్డే వరల్డ్‌కప్‌-2027 ఆడే అవకాశం లేదని కుండబద్దలు కొట్టాడు. కాగా గత కొంతకాలంలో టెస్టుల్లో భారత జట్టు వైఫల్యం చెందుతున్న విషయం తెలిసిందే.

ఇద్దరూ రిటైర్‌  అయ్యారు
స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌లో 3-0తో క్లీన్‌స్వీప్‌ కావడం సహా ఆస్ట్రేలియాతో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ-2025ని 3-1తో కోల్పోయింది. ఈ రెండు సిరీస్‌లలో విఫలమైన నేపథ్యంలో తొలుత రోహిత్‌ శర్మ.. ఆ తర్వాత వారం తిరిగే లోపే కోహ్లి టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించారు.

యాభై ఓవర్ల ఫార్మాట్లో అతడే కెప్టెన్‌
వీరిద్దరు ఇప్పటికే అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌ నుంచి కూడా వైదొలిగిన విషయం తెలిసిందే. ఇక తాను వన్డేల్లో కొనసాగుతానని రోహిత్‌ తెలపగా.. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) కూడా యాభై ఓవర్ల ఫార్మాట్లో అతడే కెప్టెన్‌ అని స్పష్టం చేసింది.

మరోవైపు.. కోహ్లి సోమవారం(మే 12) నాటి రిటైర్మెంట్‌ ప్రకటన సందర్భంగా టెస్టులకు వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపాడే గానీ.. వన్డేల గురించి ప్రస్తావించలేదు. ఈ నేపథ్యంలో స్పోర్ట్స్‌ టుడేతో మాట్లాడిన గావస్కర్‌.. కోహ్లి- రోహిత్‌ వరల్డ్‌కప్‌-2027 నాటికి జట్టులో ఉండే పరిస్థితి కనిపించడం లేదన్నాడు.

కోహ్లి, రోహిత్‌ వన్డే వరల్డ్‌కప్‌-2027 ఆడరు
‘‘వన్డే ఫార్మాట్లో వాళ్లిద్దరు అత్యద్భుతమైన ఆటగాళ్లు. అయితే, 2027 ప్రపంచకప్‌ నాటికి సెలక్షన్‌ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చెప్పలేము. వాళ్లిద్దరు వరల్డ్‌కప్‌ జట్టులో ఉంటారో లేదో తెలియదు. అందుకు తగ్గట్లుగా వారి ప్రదర్శన కొనసాగుతుందా? అంటే అదీ తెలియదు.

ఒకవేళ సెలక్షన్‌ కమిటీ వాళ్లపై నమ్మకం ఉంచితే ఇద్దరూ మరో ప్రపంచకప్‌ ఆడతారు. అయితే, నా అభిప్రాయం ప్రకారం.. కోహ్లి- రోహిత్‌ మరో వరల్డ్‌కప్‌ ఆడే అవకాశం లేదు.

ఒకవేళ వాళ్లిద్దరు వచ్చే ఏడాది గనుక మంచి ఫామ్‌లో ఉంటే.. అది కూడా శతకాలు బాదితే... అప్పుడు దేవుడు కూడా వాళ్లను జట్టు నుంచి తప్పించలేడు! కానీ అదంతా జరుగుతుందో లేదో చూడాలి’’ అని గావస్కర్‌ తన అభిప్రాయం పంచుకున్నాడు. 

తిరుగులేని రికార్డులు
కాగా వన్డేల్లో అత్యధికంగా మూడుసార్లు డబుల్‌ సెంచరీ చేసిన బ్యాటర్‌గా రోహిత్‌ కొనసాగుతుంటే.. ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఈ ఫార్మాట్లో 51 శతకాలు బాది కోహ్లి ప్రపంచ రికార్డు సాధించాడు. తద్వారా దిగ్గజ బ్యాటర్‌ సచిన్‌ టెండుల్కర్‌ వన్డే సెంచరీల రికార్డును అతడు బద్దలు కొట్టాడు.  

కాగా ప్రస్తుతం రోహిత్‌ వయస్సు 38 ఏళ్లు కాగా.. కోహ్లికి 36 ఏళ్లు. ఈ ఇద్దరూ వరల్డ్‌కప్‌ నాటికి వరసగా 40, 38వ పడిలో అడుగుపెడతారు. ఫిట్‌నెస్‌ కాపాడుకుంటూ ఫామ్‌ను కొనసాగిస్తే వీరు 2027 టీమిండియా ప్రపంచకప్‌ జట్టులో ఉండటం ఖాయమే!

చదవండి: కోహ్లి రిటైర్మెంట్‌పై బీసీసీఐ ట్వీట్‌.. మండిపడుతున్న అభిమానులు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)