Breaking News

దిగ్గజంతో చేతులు కలిపిన రోహిత్‌, విరాట్‌..

Published on Wed, 07/05/2023 - 17:34

డబ్ల్యూటీసీ ఫైనల్‌ తర్వాత టీమిండియా వెస్టిండీస్‌ టూర్‌కు సన్నద్ధమైంది. ఇప్పటికే కరీబియన్‌కు చేరుకున్న భారత ఆటగాళ్లు తమ ప్రాక్టీస్‌ను ఆరంభించారు. ఇక విండీస్‌ పర్యటనలో టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్‌లు ఆడనుంది. 

ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు బుధవారం విండీస్‌ దిగ్గజ ప్లేయర్‌ గ్యారీ సోబర్స్‌ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలతోపాటు శుభ్‌మన్ గిల్, అశ్విన్, శార్దూల్ ఠాకూర్ లాంటి క్రికెటర్లు గ్యారీ సోబర్స్‌తో మాట్లాడారు. అనంతరం కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆటగాళ్లను అందరిని దగ్గరుండి పరిచయం చేయించాడు.

గిల్ ను పరిచయం చేస్తూ.. మా టీమ్ లో ఉన్న యంగ్, ఎక్సైటింగ్ ప్లేయర్ ఇతడు అని చెప్పడం విశేషం. సోబర్స్, అతని భార్య స్టేడియానికి వచ్చారు. తనను కలిసి టీమిండియా క్రికెటర్లందరికీ సోబర్స్ తన భార్యను ప్రత్యేకంగా పరిచయం చేశాడు. గ్యారీ సోబర్స్‌ రోహిత్, విరాట్‌లతో ప్రత్యేకంగా ముచ్చటించాడు. ఈ వీడియోను బీసీసీఐ షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. నిజానికి సోబర్స్ ను కలిసి విరాట్ కోహ్లి.. 2020లో అదే గ్యార్‌ఫీల్డ్ సోబర్స్ పేరిట ఉన్న మేల్ క్రికెట్ ఆఫ్ ద డెకేడ్ అవార్డు(గ్యారీ సోబర్స్‌ అవార్డు) గెలుచుకున్నాడు.

ఇప్పటికే వన్డే, టెస్ట్ జట్లను బీసీసీఐ ప్రకటించింది. టి20 జట్టును మాత్రం కొత్త చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేయాల్సి ఉంది. ప్రస్తుతం టీమిండియా టెస్టుల్లో నంబర్ వన్, వన్డేల్లో నంబర్ టూ ర్యాంకుల్లో ఉంది. తొలి టెస్ట్ జులై 12న ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓడిన తర్వాత టీమిండియా ఆడబోతున్న తొలి సిరీస్ ఇదే.

ఇండియా టెస్టు టీమ్: రోహిత్ శర్మ(కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లి, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే, కేఎస్ భరత్, ఇషాన్ కిషన్, అశ్విన్, జడేజా, శార్దూల్, అక్షర్, సిరాజ్, ముకేశ్ కుమార్, జైదేవ్ ఉనద్కట్, నవ్‌దీప్ సైనీ

చదవండి: చీఫ్‌ సెలెక్టర్‌గా అజిత్‌ అగార్కర్‌ పారితోషికం ఎంతో తెలుసా? 

Videos

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)