Breaking News

2026లో విరాట్‌ కోహ్లి ఛేదించబోయే భారీ రికార్డులు ఇవే..!

Published on Sun, 01/04/2026 - 19:12

రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లి 2026వ సంవత్సరంలోనూ రికార్డు వేటను కొనసాగించనున్నాడు. టీ20, టెస్ట్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించి, వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విరాట్‌..  గతేడాది చివరి వరకు రికార్డుల వేటను కొనసాగించాడు. 

లిస్ట్‌-ఏ ఫార్మాట్‌లో భీకర ఫామ్‌లో ఉన్న విరాట్‌.. త్వరలో న్యూజిలాండ్‌తో జరుగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో బరిలోకి దిగుతాడు. ఈ సిరీస్‌ నుంచే విరాట్‌ రికార్డుల వేట మొదలవుతుంది. జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌ సిరీస్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో విరాట్‌ ఈ ఏడాది ఛేదించే అవకాశం ఉన్న రికార్డులపై ఓ లుక్కేద్దాం.

28000 అంతర్జాతీయ పరుగులు
అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు 623 ఇన్నింగ్స్‌లు ఆడిన విరాట్‌ 27975 పరుగులు చేశాడు. న్యూజిలాండ్‌ సిరీస్‌లో విరాట్‌ మరో 25 పరుగులు చేస్తే అత్యంత వేగంగా 28000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు సచిన్ (644 ఇన్నింగ్స్) పేరిట ఉంది.

15000 వన్డే పరుగులు
308 ఇన్నింగ్స్‌ల్లో 14557 పరుగులు చేసి, వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా కొనసాగుతున్న విరాట్‌.. మరో 443 పరుగులు చేస్తే 15000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. ఈ ఏడాది న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌ సిరీస్‌ల్లో విరాట్‌ ఈ రికార్డును ఛేదించే అవకాశం ఉంది. వన్డేల్లో ఇప్పటివరకు సచిన్‌ మాత్రమే 15000 పరుగుల మార్కును తాకాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో రెండో అత్యధిక పరుగులు
విరాట్‌ మరో 42 పరుగులు చేస్తే సచిన్‌ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరిస్తాడు. ఈ క్రమంలో సంగక్కరను (28,016) వెనక్కు నెట్టేస్తాడు.

అత్యధిక వన్డే పరుగులు
న్యూజిలాండ్‌ సిరీస్‌లో విరాట్‌ మరో 94 పరుగులు చేస్తే, ఆ దేశంపై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలుస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు సచిన్ (42 మ్యాచ్‌ల్లో 1750 పరుగులు) ఖాతాలో ఉంది. విరాట్‌ న్యూజిలాండ్‌తో ఇప్పటివరకు 33 వన్డేలు ఆడి 1657 పరుగులు చేశాడు.

ఐపీఎల్‌లో 9000 పరుగులు
ఈ ఏడాది అంతర్జాతీయ వన్డేలతో పాటు ఐపీఎల్‌ కూడా ఆడనున్న విరాట్‌.. మరో 339 పరుగులు చేస్తే ఐపీఎల్‌ చరిత్రలో 9000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా చరిత్రలో నిలిచిపోతాడు. ప్రస్తుతం విరాట్‌ ఖాతాలో 8,661 పరుగులు (267 మ్యాచ్‌లు) ఉన్నాయి. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)