Breaking News

కిషోర్‌ కుమార్‌ 'బంగ్లా'లో రెస్టారెంట్‌ ప్రారంభించనున్న కోహ్లి!

Published on Thu, 09/01/2022 - 18:12

ఆసియా కప్ 2022లో బిజీగా ఉన్న టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి త్వరలోనే రెస్టారెంట్‌ ప్రారంభించనున్నట్లు సమాచారం. ముంబై ప్రాంతంలో బాలీవుడ్‌ లెజెండరీ సింగర్‌ కిషోర్‌ కుమార్‌కు చెందిన బంగ్లాలో ఈ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. కిషోర్‌ కుమార్‌కు చెందిన బంగ్లాలోని 'గౌరీ కుంజ్‌' పోర్షన్‌ను విరుష్క దంపతులు ఐదేళ్ల పాటు లీజుకు తీసుకోనున్నారు.

కాగా విరాట్‌ కోహ్లి తన జెర్సీ నెంబర్‌ 18ను వన్‌8 కమ్యూన్‌ పేరిట తన స్వస్థలం ఢిల్లీతో పాటు కోల్‌కతా, పుణేలో రెస్ట్రోబార్స్‌ ఏర్పాటు చేశాడు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో.. ''జుహు, ముంబై.. కమింగ్‌ సూన్‌'' అంటూ హ్యాష్‌ట్యాగ్‌ జత చేశాడు. రెస్టారెంట్‌ ఏర్పాటుకు సంబంధించి లీజు, ఇతర పనులను కోహ్లి లీగల్‌ అథారిటీ సెల్‌ దగ్గరుండి పర్యవేక్షించనుంది. కోహ్లి ప్రారంభించబోయే రెస్టారెంట్‌పై త్వరలోనే  మరిన్ని వివరాలు తెలిసే అవకాశముంది.

స్వతహగా వ్యాపార రంగంపై ఆసక్తి కనబరిచే కోహ్లి.. 'వన్‌8' బ్రాండ్‌ పేరిట ఇప్పటికే క్లాత్‌, షూస్‌, హాస్పిటాలిటీ రంగాలలో పెట్టుబడులు పెట్టి మంచి లాభాలు కూడా అందుకుంటున్నాడు. ఇటీవలే ''వ్రాంగ్‌'' బ్రాండెడ్‌ కంపెనీకి చెందిన ''క్లోతింగ్‌ అండ్‌ యాక్ససరీస్‌లకు'' సంబంధించిన పలు బ్రాండ్లలో కోహ్లి ఇన్వెస్ట్‌ చేశాడు. 

కిషోర్‌ కుమార్‌ బంగ్లాలో రెస్టారెంట్‌ ప్రారంభించాలన్న కోహ్లి ఆలోచనను కొంతమంది ప్రసంశించారు. ఇప్పటికే ఈ బంగ్లాకు ''ఐకానిక్‌ బంగ్లా'' అని పేరు ఉంది. దిగ్గజం కిషోర్‌ కుమార్‌ ఇక్కడున్న చెట్లకు పలు పేర్లు పెట్టినట్లు ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అంతేకాదు ఆయన వాడిన వింటేజ్‌ కార్లు, వస్తువులు ఇక్కడి మ్యూజియంలో పెట్టారు. కాగా కిషోర్‌ కుమార్‌ చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు అమిత్‌ కుమార్‌ తన కుటుంబంతో కలిసి ఇదే బంగ్లాలో నివసిస్తుండడం విశేషం.

ఇక ప్రస్తుతం ఆసియాకప్‌లో బిజీగా ఉన్న కోహ్లి టీమిండియా తరపున మంచి ప్రదర్శనే కనబరుస్తున్నాడు. సెంచరీ చేయకపోయినా పాకిస్తాన్‌, హాంకాంగ్‌లతో జరిగిన మ్యాచ్‌ల్లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. పాక్‌తో మ్యాచ్‌లో 35 పరుగులు చేసి ఔటైన కోహ్లి.. హాంకాంగ్‌తో మ్యాచ్‌లో 59 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. 

చదవండి: IND Vs AFG: టీమిండియాతో అఫ్గానిస్తాన్‌ మ్యాచ్‌.. కళ్లన్నీ ఆ యువతిపైనే!

Videos

కవిత లేఖ ఓ డ్రామా: బండి సంజయ్

హైదరాబాద్ లో కరోనా కేసు నమోదు

జహీరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: సీఎం రేవంత్

ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ విచారం

YSRCP హరికృష్ణను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి.. దారుణం! : Ambati Rambabu

Sake Sailajanath: ఆరోపణలే తప్ప ఆధారాలు లేవు

First case: కడప కరోనా కేసును దాచిపెట్టేందుకు అధికారుల యత్నం

హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ట్రంప్ సర్కార్ 6 షరతులు

Chittoor: మామిడి రైతుల ఆవేదన..చేతులెత్తేసిన కూటమి

West Godavari: పేదల కల కలగానే మిగిలింది పడకేసిన ఇళ్ల నిర్మాణ పనులు

Photos

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)