Breaking News

డ్యాన్స్‌ ఇరగదీసిన విరాట్ కోహ్లి.. సాహో అంటున్న నెటిజన్లు

Published on Wed, 03/15/2023 - 12:15

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కొద్ది రోజుల కిందటే టెస్ట్‌ల్లో 27వ శతకాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. BGT-2023లో భాగంగా అహ్మదాబాద్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్ట్‌లో కోహ్లి ఈ ఫీట్‌ను సాధించి, అన్ని ఫార్మాట్లలో కింగ్‌ ఈజ్‌ బ్యాక్‌ అని సంకేతాలు పంపాడు.

పరుగులు సాధించడంలో, రికార్డులు బద్దలు కొట్టడంలో, సెంచరీల మీద సెంచరీలు సాధించడంలో కసిగా వ్యవహరించే కింగ్‌ కోహ్లి.. తరుచూ మైదానంలో స్టెప్పులు వేసి అలరిస్తుంటాడు. అప్పుడప్పుడు ఆఫ్‌ ద ఫీల్డ్‌ కూడా తనలోని నాట్య ప్రావిణ్యానికి పని చెబుతూ ఫ్యాన్స్‌ మనసులు దోచుకుంటుంటాడు.

ఆసీస్‌తో నాలుగో టెస్ట్‌ ముగిసాక కూడా కోహ్లి ఇలాంటి ఓ అదిరిపోయే నృత్య ప్రదర్శనే చేశాడు. ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన నార్వే డ్యాన్స్‌ గ్రూప్‌ 'క్విక్‌ స్టయిల్‌'తో కలిసి కోహ్లి డ్యాన్స్‌ ఇరగదీశాడు. క్విక్‌ స్టయిల్‌ కొన్ని షోలు చేసేందుకు ముంబైకి రాగా కోహ్లి ఆ బ్యాండ్‌ను కలిసి ఓ అదరిపోయే డ్యాన్స్‌ వీడియో చేశాడు.

ఇందులో కోహ్లి బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌కు (Stereo Nation's Ishq) తగ్గట్టుగా బ్యాట్‌ పట్టుకుని క్విక్‌ స్టయిల్‌ సభ్యులతో కలిసి ముందుకు కదులుతూ డ్యాన్స్‌ వేశాడు. ఈ వీడియోను క్విక్‌ స్టయిల్‌ తమ అఫీషియల్‌ ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్‌ చేయగా, నిమిషాల వ్యవధిలోనే లక్షల సంఖ్యలో వ్యూస్‌, లైక్స్‌ వచ్చాయి.

క్విక్‌ స్టయిల్‌ బ్యాండ్‌తో కలిసి దిగిన ఫోటోను కోహ్లి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయగా క్షణాల్లో వైరలైంది. ఈ పోస్ట్‌కు కోహ్లి.. ముంబైలో ఎవరిని కలిసానో గెస్‌ చేయండి అంటూ క్యాప్షన్‌ పెట్టగా.. కోహ్లి సతీమణి అనుష్క శర్మ ఫైర్‌ ఏమోజీలతో రిప్లై ఇచ్చింది. మిలియన్ల కొద్ది లైకులు, వ్యూస్‌ వస్తున్న ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

కాగా, నార్వే డ్యాన్స్‌ బ్యాండ్‌ క్విక్‌ స్టయిల్‌ ఇటీవలకాలంలో ప్రముఖ బాలీవుడ్‌ చిత్రాల్లోని సాడి గల్లీ, కాలా చష్మా పాటలతో విపరీతంగా పాపులరైన విషయం తెలిసిందే. ఈ పాటలకు క్విక్‌ స్టయిల్‌ అదిరిపోయే స్టెప్పులేసి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. 

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)