Breaking News

విరాట్ కోహ్లి నాగిన్ డ్యాన్స్‌.. వీడియో వైరల్‌

Published on Sun, 01/11/2026 - 18:30

టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లి మైదానంలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. కింగ్ కోహ్లి కేవలం బ్యాటింగ్‌తోనే కాకుండా తన చేష్టలతో కూడా అభిమానులను అలరిస్తుంటాడు. తాజాగా మరోసారి కోహ్లి తనలోని ఫన్నీ యాంగిల్‌ను బయటపెట్టాడు.

వడోదర వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో కోహ్లి నగిన్ డ్యాన్స్ చేశాడు.  కివీస్ ఇన్నిం‍గ్స్ 34వ ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో డేంజరస్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్.. శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో ఇండియన్ టీమ్ మొత్తం సంబరాల్లో మునిగితేలిపోయింది. కోహ్లి మాత్రం ఫ్లూట్ వూదుతున్నట్లుగా చేతులతో సైగ చేస్తూ స్పెషల్‌ సెలబ్రేషన్స్‌ చేసుకున్నాడు.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ఇక ఈ మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. కివీస్‌ బ్యాటర్లలో డార్లీ మిచెల్‌(71 బంతుల్లో 84), డెవాన్‌ కాన్వే(56), హెన్రీ నికోల్స్‌(62) హాఫ్‌ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్ద్‌ కృష్ణ, హర్షిత్‌ రానా తలా రెండు వికెట్లు సాధించారు. కుల్దీప్‌ యాదవ్‌ ఓ వికెట్‌ పడగొట్టాడు.
చదవండి: IND vs NZ: 'అతడికి మరోసారి అన్యాయం.. కావాలనే ఎదగనివ్వడం లేదు'


 

 

 

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)