Breaking News

రోహిత్‌ శర్మను కిందికి దించి అగ్రపీఠాన్ని అధిరోహించిన విరాట్‌ కోహ్లి

Published on Wed, 01/14/2026 - 14:29

ఐసీసీ ఇవాళ (జనవరి 14) విడుదల చేసిన వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఫ్యాన్స్‌కు మిశ్రమ అనుభవాలు ఎదురయ్యాయి. దిగ్గజ బ్యాటర్లలో ఒకరు టాప్‌ ర్యాంక్‌కు చేరుకొని సొంత అభిమానుల్లో ఆనందం నింపగా.. అప్పటికే టాప్‌ ప్లేస్‌లో ఉన్న మరో ఆటగాడు రెండు స్థానాలు కోల్పోయి, పర్సనల్‌ ఫ్యాన్స్‌ను నిరాశకు గురి చేశాడు. ఇంతకీ ఆ దిగ్గజ బ్యాటర్లు ఎవరంటే..?

విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ. విరాట్‌ తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 93 పరుగులు చేయడంతో ర్యాంకింగ్స్‌లో ఓ స్థానం మెరుగుపర్చుకొని టాప్‌ ర్యాంక్‌కు చేరాడు. అప్పటికే టాప్‌ ప్లేస్‌లో ఉండిన రోహిత్‌ శర్మ న్యూజిలాండ్‌పై కేవలం 26 పరుగులకే పరిమితం కావడంతో రెండు స్థానాలు కోల్పోయి మూడో స్థానానికి పడిపోయాడు. 

అదే మ్యాచ్‌లో 84 పరుగులతో సత్తా చాటిన న్యూజిలాండ్‌ ఆటగాడు డారిల్‌ మిచెల్‌ ఓ స్థానం మెరుగపర్చుకొని రెండో స్థానానికి ఎగబాకాడు. అదే మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్‌ (29 నాటౌట్‌) ఆడిన కేఎల్‌ రాహుల్‌ ఓ స్థానం మెరుగుపర్చుకొని, 11వ స్థానానికి చేరాడు. టాప్‌-10లో భారత్‌ తరఫున మరో ఇద్దరు ఆటగాళ్లు కూడా ఉన్నారు. శుభ్‌మన్‌ గిల్‌ 5, శ్రేయస్‌ అయ్యర్‌ 10 స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇవి మినహా ఈ వారం ర్యాంకింగ్స్‌లో చెప్పుకోదగ్గ మార్పులేమీ లేవు.

బౌలర్ల విషయానికొస్తే.. టాప్‌-10లో ఒక్క మార్పు కూడా లేదు. రషీద్‌ ఖాన్‌, జోఫ్రా ఆర్చర్‌, కుల్దీప్‌ యాదవ్‌ టాప్‌-3గా కొనసాగుతున్నారు. భారత పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ ఈ వారం ర్యాంకింగ్స్‌లో గణనీయంగా లబ్ది పొందాడు. న్యూజిలాండ్‌పై తొలి వన్డేలో 2 వికెట్లు తీయడంతో ఐదు స్థానాలు మెరుగుపర్చుకొని 16వ స్థానానికి చేరాడు. అదే మ్యాచ్‌లో ఘోరంగా విఫలమైన మరో టీమిండియా బౌలర్‌ రవీంద్ర జడేజా ఐదు స్థానాలు కోల్పోయి 21వ ప్లేస్‌కు పడిపోయాడు.

ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. ఒమర్‌జాయ్‌, సికందర్‌, మొహమ్మద్‌ నబీ టాప్‌-3లో కొనసాగుతుండగా.. భారత్‌ తరఫున అక్షర్‌ పటేల్‌ పదో స్థానంలో నిలిచాడు. 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)