Breaking News

రెండో వన్డేలో రోహిత్, కోహ్లికి విశ్రాంతి..?

Published on Wed, 07/15/2026 - 15:32

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ సిరీస్‌లో రెండో వన్డే కార్డిప్‌ వేదికగా 16వ తేదీ జరుగనుంది.

ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టు రోటేషన్ విధానంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని జట్టులో పలు కాంబినేషన్లను పరీక్షిస్తున్నట్లు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వెల్లడించాడు.

తొలి వన్డే అనంతరం మాట్లాడిన అతడు.. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సరైన సమతుల్యత కలిగిన జట్టును ఎంపిక చేసేందుకు విభిన్న కాంబినేషన్లను పరిశీలిస్తున్నామని తెలిపాడు.

ప్రపంచకప్‌ దక్షిణాఫ్రికాలో జరుగనుండగా, అక్కడి పరిస్థితులకు ఇంగ్లండ్ పిచ్‌లు కొంతవరకు సమానంగా ఉంటాయని.. అందుకే ఈ సిరీస్‌ను ప్రయోగాలకు ఉపయోగించుకుంటున్నామని వివరించాడు.

ఈ వ్యాఖ్యలతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు విశ్రాంతి ఇవ్వొచ్చనే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. దీనిపై అధికారిక ప్రకటన అయితే లేదు.

ఒకవేళ వీరిలో ఎవరికైనా విశ్రాంతినిస్తే, వికెట్‌కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్‌కు తుది జట్టులో చోటు దక్కే అవకాశముంది. అవసరానికి అనుగుణంగా బ్యాటింగ్ క్రమంలో మార్పులు చేసి జట్టు సమతుల్యతను కొనసాగించే అవకాశం ఉంది. కాగా, తొలి వన్డేలో రోహిత్ శర్మ 11, విరాట్ కోహ్లి 5 పరుగులకు ఔటై నిరాశపరిచారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)