Breaking News

శతక్కొట్టిన ద్రవిడ్‌ చిన్న కుమారుడు.. బౌండరీల వర్షం

Published on Sat, 12/14/2024 - 08:29

మూలపాడు (ఆంధ్రప్రదేశ్‌): భారత బ్యాటింగ్‌ దిగ్గజం రాహుల్‌ ద్రవిడ్‌ చిన్న కుమారుడు అన్వయ్‌ (153 బంతుల్లో 100 నాటౌట్‌; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ శతకంతో మెరిశాడు. విజయ్‌ మర్చంట్‌ ట్రోఫీలో భాగంగా జార్ఖండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఈ కర్ణాటక బ్యాటర్‌ ఆకట్టుకున్నాడు.

మూడు రోజుల మ్యాచ్‌లో ఆఖరి రోజు కర్ణాటక తొలిఇన్నింగ్స్‌లో 123.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 441 పరుగుల భారీస్కోరు చేయగా, మ్యాచ్‌ ‘డ్రా’గా ముగిసింది. జట్టు తరఫున నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అన్వయ్‌ మొదట శమంతక్‌ అనిరుధ్‌ (76)తో కలిసి మూడో వికెట్‌కు 167 పరుగులు జతచేశాడు.

387 పరుగులకు ఆలౌట్‌
అనిరుధ్‌ అవుటయ్యాక వచ్చిన సుకుర్థ్‌ (33)తో నాలుగో వికెట్‌కు 43 పరుగులు జోడించాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేపట్టిన జార్ఖండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 128.4 ఓవర్లలో 387 పరుగులు చేసి ఆలౌటైంది. 54 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సంపాదించిన కర్ణాటకకు 3 పాయింట్లు లభించగా, జార్ఖండ్‌ ఒక్క పాయింట్‌తో సరిపెట్టుకుంది.

జోనల్‌ టోర్నమెంట్‌లో డబుల్‌ సెంచరీ
అన్వయ్‌ ద్రవిడ్‌ గతేడాది కర్ణాటక అండర్‌–14 జట్టుకు సారథ్యం వహించాడు. విజయ్‌ మర్చంట్‌ టోర్నీకి ముందు జరిగిన కేఎస్‌సీఏ (కర్ణాటక క్రికెట్‌ సంఘం) అండర్‌–16 ఇంటర్‌ జోనల్‌ టోర్నమెంట్‌లో బెంగళూరు జోన్‌కు ప్రాతినిధ్యం వహించిన అన్వయ్‌... తుంకూర్‌ జోన్‌పై చెలరేగి ఆడాడు. డబుల్‌ సెంచరీ (200 నాటౌట్‌)తో అజేయంగా నిలిచాడు.

ఇక అన్వయ్‌ అన్నయ్య 19 ఏళ్ల సమిత్‌ కూడా ఇదివరకే జూనియర్‌ క్రికెట్లో ఆల్‌రౌండర్‌గా నిరూపించుకున్నాడు. సొంతగడ్డపై ఆ్రస్టేలియా అండర్‌–19 జట్టుతో జరిగిన పరిమిత ఓవర్ల, ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో సమిత్‌ ద్రవిడ్‌ రాణించాడు.  

చదవండి: ఫాస్టెస్ట్‌ సెంచరీ.. వెస్టిండీస్‌ బ్యాటర్‌ ప్రపంచ రికార్డు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)