Breaking News

చెలరేగిన ‘టీమిండియా’ స్టార్లు.. 63 పరుగులకే ఆలౌట్‌!

Published on Wed, 12/31/2025 - 11:15

విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా జమ్మూ కశ్మీర్‌తో మ్యాచ్‌లో బెంగాల్‌ పేసర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ప్రత్యర్థి జట్టును 63 పరుగులకే ఆలౌట్‌ చేశారు. దేశీ వన్డే టోర్నీ గ్రూప్‌-బిలో భాగంగా జమ్మూ కశ్మీర్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బెంగాల్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

శుభారంభం అందించిన షమీ
కెప్టెన్‌ అభిమన్యు ఈశ్వరన్‌ నమ్మకాన్ని నిలబెడుతూ బెంగాల్‌ బౌలర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. జమ్మూ కశ్మీర్‌ టాపార్డర్‌లో ఓపెనర్‌ కమ్రాన్‌ ఇక్బాల్‌ (0)ను డకౌట్‌ చేసి.. టీమిండియా వెటరన్‌ పేసర్‌ మొహమ్మద్‌ షమీ శుభారంభం అందించాడు.

షమీకి తోడుగా టీమిండియా స్టార్లు ఆకాశ్‌ దీప్‌, ముకేశ్‌ కుమార్‌ నిప్పులు చెరుగుతూ జమ్మూ కశ్మీర్‌ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. వన్‌డౌన్‌లో వచ్చిన మురుగన్‌ అశ్విన్‌ (0)ను ఆకాశ్‌ దీప్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకోగా.. ఓపెనర్‌ శుభం ఖజూరియా (12)ను ముకేశ్‌ వెనక్కి పంపాడు.

చెలరేగిన ముకేశ్‌, ఆకాశ్‌
ఇక యావర్‌ హసన్‌ (1) రూపంలో షమీ తన రెండో వికెట్‌ తీయగా.. కెప్టెన్‌ పారస్‌ డోగ్రా (19) సహా అబ్దుల్‌ సమద్‌ (8), యుధ్‌వీర్‌ సింగ్‌ చరక్‌ (7) వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు.. ముకేశ్‌ కుమార్‌.. రిధమ్‌ శర్మ (7), అబిద్‌ ముస్తాక్‌ (2), అకిబ్‌ నబీ దార్‌ (0)లను పెవిలియన్‌కు పంపాడు.

మొత్తంగా షమీ రెండు వికెట్లు తీయగా.. ఆకాశ్‌ దీప్‌, ముకేశ్‌ కుమార్‌ చెరో నాలుగు వికెట్లతో చెలరేగి.. జమ్మూ కశ్మీర్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించారు. ఫలితంగా 20.4 ఓవర్లలో కేవలం 63 పరుగులు చేసి జమ్మూ కశ్మీర్‌ ఆలౌట్‌ అయింది. కాగా బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న షమీ, ముకేశ్‌ కుమార్‌ చాన్నాళ్లుగా టీమిండియాకు దూరం కాగా..  ఆకాశ్‌ దీప్‌ ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా జూలైలో చివరగా భారత జట్టుకు ఆడాడు. 

చదవండి: బీసీసీఐ యూటర్న్‌!.. షమీకి గోల్డెన్‌ ఛాన్స్‌!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)