కోహ్లి, పంత్‌ మెరుపులు

Published on Fri, 12/26/2025 - 12:39

విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26లో టీమిండియా స్టార్లు, ఢిల్లీ బ్యాటర్లు విరాట్‌ కోహ్లి, రిషబ్‌ పంత్‌ మెరుపులు మెరిపించారు. గుజరాత్‌తో ఇవాళ (డిషెంబర్‌ 26) జరుగుతున్న మ్యాచ్‌లో అర్ద సెంచరీలతో సత్తా చాటారు. విరాట్‌ 61 బంతుల్లో 13 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 77 పరుగులు చేయగా.. పంత్‌ 79 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 70 పరుగులు చేశాడు. 

క్లిష్టమైన పిచ్‌పై విరాట్‌, పంత్‌ చెలరేగడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ గౌరవప్రదమైన స్కోర్‌ చేయగలిగింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. విరాట్‌, పంత్‌ ఔటయ్యాక హర్ష్‌ త్యాగి (40) కాస్త నిలకడగా ఆడాడు. చివర్లో సిమర్‌జీత్‌ సింగ్‌ (15 నాటౌట్‌) బ్యాట్‌ ఝులిపించాడు.

గుజరాత్‌ బౌలర్లలో స్పిన్నర్లు విశాల్‌ జేస్వాల్‌ (10-0-42-4), రవి బిష్ణోయ్‌ (10-0-50-2) ఢిల్లీ బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. అర్జన్‌ నగస్వల్లా, కెప్టెన్‌ చింతన్‌ గజా తలో వికెట్‌ తీశారు. మిగతా ఢిల్లీ బ్యాటర్లలో ప్రియాంశ్‌ ఆర్య 1, అర్పిత్‌ రాణా 10, నితీశ్‌ రాణా 12, ఆయుశ్‌ బదోని 12, నవ్‌దీప్‌ సైనీ 6, ఇషాంత్‌ శర్మ 5 (నాటౌట్‌) పరుగులు చేయగా.. ప్రిన్స్‌ యాదవ్‌ డకౌటయ్యాడు.

3 సెంచరీలు, 3 అర్ద సెంచరీలు
లిస్ట్‌-ఏ ఫార్మాట్‌ అంటేనే పునకాలు తెప్పించే విరాట్‌ కోహ్లి గత కొంతకాలంలో ఈ ఫార్మాట్‌లో పీక్స్‌లో ఉన్నాడు. గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో అతని ప్రదర్శనలు చెప్పనశక్యంగా ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో 2 సెంచరీలు, 2 హాఫ్‌ సెంచరీలు.. దేశవాలీ స్థాయిలో (VHT 2025-26) సెంచరీ, హాఫ్‌ సెంచరీతో పట్టపగ్గాల్లేకుండా ఉన్నాడు. గత 6 లిస్ట్‌-ఏ ఇన్నింగ్స్‌ల్లో విరాట్‌ స్కోర్లు..

- 74*(81)
- 135(120)
- 102(93)
- 65*(45)
- 131(101)
- 77(61) 
 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)