Breaking News

పాపం పాకిస్తాన్‌..! మ‌రోసారి ‘టీ కప్’తో ట్రోల్ చేసిన వరుణ్

Published on Tue, 03/10/2026 - 07:36

ప్రపంచకప్‌తో భారత టీ20 జట్టు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ గాందీనగర్‌ సమీపంలోని మోనుమెంట్‌ కాంప్లెక్స్‌కు చేరగానే అక్కడంతా పండగ వాతావరణం నెలకొంది. గుజరాత్‌ వారసత్వ కట్టడం ‘అడాలజ్‌ స్టెప్‌వెల్‌’ వద్ద అధికారిక ఫొటో సెషన్‌ నిర్వహించగా...  టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ ప్రపంచకప్‌తో సందడి చేశాడు.

పాక్‌ను ట్రోల్‌ చేసిన వరుణ్‌
కాగా విజయోత్సవాల సందర్భంగా టీమిండియా స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి  సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో హాట్ టాపిక్‌గా మారింది. పాకిస్తాన్‌ను వరుణ్ మరోసారి ట్రోల్ చేశాడు. వరుణ్ చక్రవర్తి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రోఫీని పట్టుకుని టీ కప్పుతో సిప్ చేస్తున్న ఫోటోను షేర్ చేశాడు.

ఇది చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ఇదే తరహా ఫోటోను ఆసియాకప్‌-2025 విజయనంతరం కూడా అతడు షేర్ చేశాడు. ఆసియా ఛాంపియన్స్‌గా నిలిచిన భారత జట్టు.. ఏసీసీ చైర్మెన్‌, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మెన్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించింది.

ఆ సమయంలో వరుణ్ చక్రవర్తి ట్రోఫీ లేకపోయినా, తన బెడ్ పక్కన ఒక 'టీ కప్పు' పెట్టుకుని పడుకున్న ఫోటోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. "ట్రోఫీని లాక్కోవచ్చు కానీ, ఛాంపియన్ ట్యాగ్‌ను కాదు" అని పరోక్షంగా పాక్‌కు చురకలు అంటించాడు. ఇప్పుడు ఒరిజినల్ వరల్డ్ కప్ ట్రోఫీతో మళ్ళీ అదే విధంగా కాఫీ తాగుతూ ఫోటోను షేర్ చేస్తూ పాక్‌ను ట్రోల్ చేశాడు.
చదవండి: ఐసీసీ ప్రపంచకప్‌ టీమ్‌లో సామ్సన్, బుమ్రా, పాండ్యా, ఇషాన్‌... కెప్టెన్‌గా మార్క్‌రమ్‌
 

Videos

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)