నంబర్‌ 1: చరిత్ర సృష్టించిన వరుణ్‌ చక్రవర్తి

Published on Wed, 12/17/2025 - 17:32

టీమిండియా మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) టీ20 ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమ రేటింగ్‌ సాధించిన భారత బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో పేస్‌ దళ నాయకుడు జస్‌ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah) పేరిట ఉన్న రికార్డును వరుణ్‌ చక్రవర్తి బద్దలు కొట్టాడు.

అత్యుత్తమంగా 32 వికెట్లు
కాగా 2021 టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో పేలవ ప్రదర్శన తర్వాత వరుణ్‌ చక్రవర్తి (Varun Chakravarthy) టీమిండియాకు దూరమయ్యాడు. అయితే, ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి రీఎంట్రీ ఇచ్చిన ఈ రైటార్మ్‌ స్పిన్నర్‌.. అసాధారణ ప్రతిభతో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికి 19 టీ20 మ్యాచ్‌లలో కలిపి వరుణ్‌ చక్రవర్తి అత్యుత్తమంగా 32 వికెట్లు కూల్చాడు.

సౌతాఫ్రికాతో స్వదేశంలో తాజా టీ20 సిరీస్‌లోనూ వరుణ్‌ చక్రవర్తి అదరగొడుతున్నాడు. ఇప్పటికి సఫారీలతో జరిగిన మూడు మ్యాచ్‌లలో రెండేసి వికెట్ల చొప్పున ఆరు వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో ఓవరాల్‌గా 6.75 ఎకానమీతో వికెట్లు తీసిన వరుణ్‌.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ దుమ్ములేపాడు.

818 రేటింగ్‌ పాయింట్లు
టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న వరుణ్‌ చక్రవర్తి.. రేటింగ్‌ను భారీగా మెరుగుపరచుకున్నాడు. కెరీర్‌లోనే అత్యుత్తమంగా ఏకంగా 818 రేటింగ్‌ పాయింట్లు సాధించి.. రెండో ర్యాంకర్‌ జేకబ్‌ డఫీ (699 పాయింట్లు)కి అందనంత దూరంలో నిలిచాడు.

అదే విధంగా.. అంతర్జాతీయ టీ20లలో అత్యుత్తమ రేటింగ్‌ సాధించిన భారత బౌలర్‌గానూ వరుణ్‌ చక్రవర్తి నిలిచాడు. అంతకుముందు.. 2017లో బుమ్రా కెరీర్‌ బెస్ట్‌ 783 రేటింగ్‌ పాయింట్లతో ఈ ఘనత సాధించగా.. వరుణ్‌ ఇప్పుడు దానిని అధిగమించాడు.

అంతేకాదు.. అత్యుత్తమ టీ20 రేటింగ్‌ పాయింట్లు కలిగి ఉన్న టాప్‌-10 ఓవరాల్‌ బౌలర్ల జాబితాలోనూ చోటు సంపాదించాడు. కాగా ఈ ఏడాది సెప్టెంబరులో వరుణ్‌ తొలిసారి టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం పొందిన విషయం తెలిసిందే. 

ఇదిలా ఉంటే.. టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ టాప్‌ ర్యాంకు నిలబెట్టుకోగా.. తిలక్‌ వర్మ రెండు స్థానాలు ఎగబాకి.. నాలుగో ర్యాంకులో నిలిచాడు.

పురుషుల అంతర్జాతీయ టీ20లలో బెస్ట్‌ బౌలర్‌ రేటింగ్స్‌
👉ఉమర్ గుల్ (పాకిస్తాన్)- 865
👉శామ్యూల్ బద్రీ (వెస్టిండీస్-) 864
👉డేనియల్ వెటోరి (న్యూజిలాండ్)- 858
👉సునీల్ నరైన్ (వెస్టిండీస్)- 832
👉రషీద్ ఖాన్ (అఫ్గనిస్తాన్)- 828
👉తబ్రేజ్‌ షంసీ (దక్షిణాఫ్రికా)- 827
👉షాహిద్ అఫ్రిది (పాకిస్థాన్)- 822
👉వరుణ్ చక్రవర్తి (ఇండియా)- 818
👉షాదాబ్ ఖాన్ (పాకిస్తాన్)- 811
👉వనిందు హసరంగా (శ్రీలంక)- 809.

చదవండి: IPL 2026: కనక వర్షం.. ‘మినీ’ వేలంలో ఎవరికి ఎంత? పది జట్ల వివరాలు

Videos

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)