Breaking News

వైభవ్‌ సూర్యవంశీ అరెస్ట్‌కు డిమాండ్‌

Published on Sat, 02/07/2026 - 08:16

హరారే వేదికగా నిన్న (ఫిబ్రవరి 6) జరిగిన అండర్‌-19 ప్రపంచకప్‌ 2026 ఫైనల్లో ఇంగ్లండ్‌పై భారత్‌ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, ఆరోసారి జగజ్జేతగా ఆవిర్భవించింది. ఈ మ్యాచ్‌లో యంగ్‌ ఇండియా చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ చరిత్రాత్మక ఇన్నింగ్స్‌ ఆడి భారత్‌ను గెలిపించాడు. 

ఈ ఇన్నింగ్స్‌ అండర్‌ 19 క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమమైందిగా కీర్తించబడుతుంది. ఈ ఇన్నింగ్స్‌లో వైభవ్‌ కేవలం 80 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్సర్ల సాయంతో 175 పరుగులు చేశాడు. అండర్‌ 19 లెవెల్లోనే కాదు, యావత్‌ క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఇదీ ఒకటిగా నిలిచిపోతుంది. 

ఈ ఇన్నింగ్స్‌లో వైభవ్‌ విధ్వంసం నభూతో నభవిష్యతి అన్నట్లుగా సాగింది. 14 కుర్ర వైభవ్‌ ఇంగ్లండ్‌ బౌలర్లపై సునామీలా విరుచుకుపడ్డాడు. పడ్డ బంతిని పడ్డట్టు ఎడాపెడా బాదాడు. వైభవ్‌లోని ఫైర్‌ చూసి ఇంగ్లండ్‌ బౌలర్లు వణికిపోయారు. ఏం చేయాలో.. బంతిని ఎక్కడ వేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. వైభవ్‌ను ఆపడం ఇంగ్లండ్‌ బౌలర్ల వల్ల కాలేదు. 

విచక్షణారాహిత్యంగా సాగిన వైభవ్‌ ఇన్నింగ్స్‌ యావత్‌ క్రికెట్‌ ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. 14 ఏళ్ల పిల్లాడు ఇంతలా రెచ్చిపోవడమేంటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. వైభవ్‌ విధ్వంసాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులు మారణహోమంగా అభివర్ణిస్తున్నారు. 

ఐస్‌లాండ్‌ క్రికెట్‌ అయితే ఓ అడుగు ముందుకేసి వైభవ్‌ను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేసింది. ఐస్‌లాండ్‌ క్రికెట్‌ చేసిన ఓ ట్వీట్‌ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఇంగ్లండ్‌ బౌలర్లపై వైభవ్‌ విరుచుకుపడిన తీరును ఐస్‌లాండ్‌ క్రికెట్‌ ఎక్స్‌ రేటెడ్‌ హింసగా పేర్కొంది. 

ఐస్‌లాండ్‌ క్రికెట్‌ ఈ ట్వీట్‌ను సరదాగా చేసినా, నెటిజన్లు దీన్ని నిజంగానే అన్వయించుకుంటున్నారు. ఎందుకంటే, ఇంగ్లండ్‌ బౌలర్లపై వైభవ్‌ విరుచుకుపడిన తీరు ఎక్స్‌ రేటెడ్‌ హింసలాగే ఉంది. ఆ బాదుడు నిజంగానే ఇంగ్లండ్‌ ఆటగాళ్లను భయబ్రాంతులకు గురి చేసింది. ఇది తలచుకొని వారు కొన్ని నెలలైనా సుఖంగా నిద్రపోలేరు. అంతలా సాగించి వైభవ్‌ బీభత్సం.

ఈ సునామీ ఇన్నింగ్స్‌తో వైభవ్‌ ఎన్నో రికార్డులను కొల్లగొట్టాడు. ఇందులో అత్యధిక సిక్సర్లు, ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ వంటి భారీ రికార్డులు కూడా ఉన్నాయి. వైభవ్‌ ఊచకోత కారణంగా తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. అండర్‌ 19 ప్రపంచకప్‌ ఫైనల్స్‌ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్‌.

అనంతరం కష్టసాధ్యమైన ఛేదనలో ఇంగ్లండ్‌ అద్భుతంగా పోరాడింది. అయితే లక్ష్యం అతి భారిది కావడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. కాలెబ్‌ (115) వీరోచిత శతకంతో ఆకట్టుకున్నాడు. చివరికి ఇంగ్లండ్‌ 40.2 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌటై, 100 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. 

Videos

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు