Breaking News

చరిత్ర సృష్టించిన వైభవ్‌ సూర్యవంశీ.. ప్రపంచ రికార్డు

Published on Thu, 07/23/2026 - 19:33

వరుస వైఫల్యాల తర్వాత టీమిండియా చిచ్చర పిడుగు వైభవ్‌ సూర్యవంశీ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. జింబాబ్వేతో తొలి టీ20లో కేవలం 18 బంతుల్లోనే అర్ధ శతకం బాదాడు.

తద్వారా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అత్యంత పిన్న వయసులోనే హాఫ్‌ సెంచరీ చేసిన క్రికెటర్‌గా సృష్టించాడు. కేవలం 15 ఏళ్ల 118 రోజుల వయసులోనే ఈ ఘనత అందుకుని ప్రపంచ రికార్డు సాధించాడు. 

భారత అండర్‌-19, ఐపీఎల్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో అరుదైన ఫీట్లు నమోదు చేసిన వైభవ్‌ సూర్యవంశీ.. ఇటీవల ఇంగ్లండ్‌ గడ్డ మీద టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు.

ఇంగ్లండ్‌లో విఫలం
ఇంగ్లండ్‌తో రెండో టీ20 సందర్భంగా సంజూ శాంసన్‌ను తప్పించిన యాజమాన్యం.. వైభవ్‌ను అరంగేట్రం చేయించింది. అయితే, తొలి మ్యాచ్‌లో పదిహేనేళ్ల ఈ లెఫ్టాండ్‌ ఓపెనర్‌ 13 పరుగులే చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత మూడు, నాలుగో టీ20లలో వరుసగా 14, 15 పరుగులు చేసి నిష్క్రమించాడు. దీంతో వైభవ్‌ ఆట తీరుపై విమర్శలు వచ్చాయి.

ఈ క్రమంలో ఐదో టీ20 నుంచి వైభవ్‌ను తప్పించి.. మళ్లీ సంజూను ఆడించారు. అయితే, జింబాబ్వేతో సిరీస్‌కు మాత్రం సంజూ శాంసన్‌ను పక్కనపెట్టిన మేనేజ్‌మెంట్‌.. అభిషేక్‌ శర్మకు ఓపెనింగ్‌ జోడీగా వైభవ్‌ సూర్యవంశీని ఎంపిక చేసింది. ఇక జింబాబ్వేతో హరారే స్పోర్ట్స్‌ క్లబ్‌ వేదికగా గురువారం నాటి తొలి టీ20లో టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. 

ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు వైభవ్‌ సూర్యవంశీ శుభారంభం అందించాడు.

ఆకాశమే హద్దుగా..
తొలి ఓవర్లో అభిషేక్‌, వైభవ్‌ పెద్దగా పరుగులు చేయలేదు. బ్లెస్సింగ్‌ ముజర్‌బానీ బౌలింగ్‌లో కేవలం చెరో పరుగు చేశారు. అయితే, రెండో ఓవర్లో రిచర్ట్‌ నగవర బౌలింగ్‌కు రాగా.. మొదటి బంతికి పరుగులేమీ రాబట్టలేకపోయినప్పటికీ.. రెండు, మూడు, నాలుగు బంతుల్లో వైభవ్‌ వరుసగా 6,4,6 బాదాడు. రెండో ఓవర్లో మొత్తంగా 20 పరుగులు పిండుకున్నాడు.

ఈ క్రమంలో మూడో ఓవర్‌ ఐదో బంతికి అభిషేక్‌ శర్మ (1)ముజర్‌బానీ బౌలింగ్‌లో అవుట్‌ అయినప్పటికీ.. వైభవ్‌ జోరు కొనసాగించాడు. కేవలం పద్దెనిమిది బంతుల్లోనే నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో యాభై పరుగుల మార్కు అందుకున్నాడు.  ఏడో ఓవర్‌లో నగరవ బౌలింగ్‌లో తొలి బంతికే ఫిఫ్టీ పూర్తి చేసుకున్న ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌.. ఆ మరుసటి బంతికే బెన్‌ కర్రాన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. 

చెప్పాడు.. చేసి చూపించాడు
అయితే, నాలుగు నెలల క్రితం ఇదే వేదిక మీద.. అండర్‌-19 వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌ మీద వైభవ్‌ 80 బంతుల్లోనే 175 పరుగులు చేసి భారత్‌కు టైటిల్‌ అందించాడు. జింబాబ్వేకు తొలి టీ20కి ముందు ఈ విషయం గురించి మాట్లాడుతూ.. తనకు హరారే స్పోర్ట్స్‌ క్లబ్‌ మీద ఆడిన అనుభవం, పిచ్‌ గురించి పూర్తి అవగాహన ఉందన్నాడు. అన్నట్లుగానే విధ్వంసకర హాఫ్‌ సెంచరీతో తళుక్కుమన్నాడు.

అంతర్జాతీయ టీ20లలో అత్యంత పిన్న వయసులో తొలి అర్ధ శతకం బాదిన క్రికెటర్లు
👉వైభవ్‌ సూర్యవంశీ (ఇండియా): జింబాబ్వే మీద హరారే వేదికగా 2026లో 15 ఏళ్ల 118 రోజుల వయసులో ఫిఫ్టీ
👉లూయీస్‌ బ్రూస్‌ (గిబ్రాల్టర్‌): మాల్టా మీద అల్బేగరియా వేదికగా 2021లో 16 ఏళ్ల 56 రోజుల వయసులో ఫిఫ్టీ
👉కవిన్‌ చద్దా (ఇండోనేషియా): స్వీడన్‌ మీద బాలి వేదికగా 2026లో 16 ఏళ్ల 76 రోజుల వయసులో ఫిఫ్టీ
👉ఆల్సినే టురే (సియెర్రా లియోన్‌): ఘనా మీద  బెనోని వేదికగా 2023లో 16 ఏళ్ల 89 రోజుల వయసులో ఫిఫ్టీ
👉టెంజిన్‌ రాబ్గే (భూటాన్‌): చైనా మీద కౌలాలంపూర్‌ వేదికగా 2023లో 16 ఏళ్ల 118 రోజుల వయసులో ఫిఫ్టీ

సచిన్‌ రికార్డు బ్రేక్‌
ఫుల్‌ మెంబర్‌ జట్లలో భాగంగా అఫ్గనిస్తాన్‌ స్టార్‌ రహ్మనుల్లా గుర్బాజ్‌ 17 ఏళ్ల 296 రోజుల వయసులో ఈ ఘనత సాధించగా.. వైభవ్‌ తాజాగా అతడిని అధగమించాడు. అంతేకాదు.. ఫుల్‌ మెంబర్‌ జట్ల తరఫున అంతర్జాతీయ క్రికెట్‌ (ఆల్‌ ఫార్మాట్‌)లో అతి పిన్న వయసులోనే అర్ధ శతకం చేసిన తొలి బ్యాటర్‌గానూ చరిత్రకెక్కాడు. 

గతంలో సచిన్‌ టెండ్కులర్‌ పాకిస్తాన్‌ మీద 1989 నాటి టెస్టు మ్యాచ్‌లో 16 ఏళ్ల 213 రోజుల వయసులో అర్ధ శతకం చేయగా.. వైభవ్‌ ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొట్టాడు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)