వైభవ్‌ సూర్యవంశీ మరోసారి చెలరేగిపోయాడు.. భారీ శతకంతో విరుచుకుపడ్డాడు

Published on Thu, 06/12/2025 - 10:43

ఐపీఎల్‌ 2025 ద్వారా పరిచయమై (రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున), 14 ఏళ్ల వయసులోనే క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ (35 బంతుల్లో) బాదిన భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పిన వైభవ్‌ సూర్యవంశీ.. తాజాగా జరిగిన ఓ మ్యాచ్‌లో మరోసారి చెలరేగిపోయాడు. 

బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ ఆకాడమీలో (ఎన్‌సీఏ) జరిగిన ఓ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో కేవలం 90 బంతుల్లోనే 190 పరుగులు చేశాడు. వైభవ్‌ విధ్వంసానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. వైభవ్‌ విధ్వం​సం చూసి క్రికెట్‌ అభిమానులు అబ్బురపడుతున్నారు. 

14 ఏళ్ల వయసులో ఈ కుర్రాడు ఇంత భారీ షాట్లు ఆడుతూ, ఇంత సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఎలా ఆడగలుగుతున్నాడని ఆశ్చర్యపోతున్నారు. పొట్టి క్రికెట్‌ భవిష్యత్తు ఇతడే అంటూ కీర్తిస్తున్నారు. భారత క్రికెట్‌లో వైభవ్‌ పెను సంచలనమని కొనియాడుతున్నారు. వైభవ్‌ టాలెంట్‌కు నీరాజనాలు పలుకుతున్నారు.

కాగా, వైభవ్‌ త్వరలో ఇంగ్లండ్‌లో పర్యటించబోయే భారత అండర్‌-19 జట్టుకు ఎంపికయ్యాడు. ఈ పర్యటనలో భారత్ ఇంగ్లండ్‌ అండర్‌-19 జట్టుతో ఓ 50 ఓవర్ల వార్మప్‌ మ్యాచ్‌, 5 వన్డేలు, రెండు మల్టీ డే మ్యాచ్‌లు (టెస్ట్‌లు) ఆడుతుంది. 

ఈ సిరీస్‌లకు భారత కెప్టెన్‌గా మరో ఐపీఎల్‌ హీరో ఆయుశ్‌ మాత్రే (సీఎస్‌కే) కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ సిరీస్‌లలో వైభవ్‌.. మాత్రేతో కలిసి భారత ఇన్నింగ్స్‌లు ప్రారంభిస్తాడు. ఇంగ్లండ్‌ పర్యటనకు ముందు ఎన్‌సీఏలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణా శిబిరంలోనే వైభవ్‌ 90 బంతుల్లో 190 పరుగులు చేశాడు.

ఇంగ్లండ్‌ పర్యటన కోసం ఎంపిక చేసిన భారత అండర్‌-19 జట్టు: ఆయుశ్‌ మాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, మౌల్యరాజ్‌సిన్హ్ చావ్డా, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ కుందు (వైస్-కెప్టెన్ & వికెట్‌కీపర్‌), హర్వాన్ష్ సింగ్ (వికెట్‌కీపర్‌), ఆర్‌ ఎస్‌ అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్‌ పటేల్, యుద్దజిత్‌ గుహా, ప్రణవ్‌ రాఘవేంద్ర, మొహమ్మద్‌ ఎనాన్‌, ఆదిత్య రాణా, అన్మోల్జీత్ సింగ్

స్టాండ్‌బై ప్లేయర్స్: నమన్ పుష్పక్, డి దీపేష్, వేదాంత్ త్రివేది, వికల్ప్ తివారీ, అలంకృత్ రాపోల్ (వికెట్‌కీపర్‌)

ఇంగ్లండ్‌ పర్యటనలో భారత అండర్‌-19 జట్టు షెడ్యూల్‌..
జూన్‌ 24- 50 ఓవర్ల వార్మప్‌ మ్యాచ్‌ (లోగ్‌బరో యూనివర్శిటీ)
జూన్‌ 27- తొలి వన్డే (హోవ్‌)
జూన్‌ 30- రెండో వన్డే (నార్తంప్టన్‌)
జులై 2- మూడో వన్డే (నార్తంప్టన్‌)
జులై 5- నాలుగో వన్డే (వార్సెస్టర్‌)
జులై 7- ఐదో వన్డే (వార్సెస్టర్‌)
జులై 12-15: తొలి మల్టీ డే మ్యాచ్‌ (బెకెన్హమ్‌)
జులై 20-23: రెండో మల్టీ డే మ్యాచ్‌ (చెమ్స్‌ఫోర్డ్‌)

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)