Breaking News

IND vs ZIM: వైభ‌వ్ సూర్యవంశీ విధ్వంసం ఖాయం..!

Published on Tue, 07/21/2026 - 19:45

భార‌త్‌-జింబాబ్వే మ‌ధ్య మూడు టీ20ల జూలై 23 నుంచి హ‌రారే స్పోర్ట్స్ క్ల‌బ్ వేదిక‌గా ప్రారంభం కానుంది. వ‌రుస‌గా మూడు సిరీస్‌ల‌ను కోల్పోయి జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన టీమిండియా అక్క‌డ‌ ఎలా రాణిస్తుందోన‌ని అంద‌రూ ఆతృతగా ఎదరు చూస్తున్నారు. మరోవైపు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి కూడా ఈ సిరీస్ అత్యంత కీలకం కానుంది. తన అరంగేట్ర సిరీస్‌లో విఫలమైన వైభవ్‌కు ఈ జింబాబ్వే టూర్ అద్భుత అవకాశంగా చెప్పుకోవాలి.

సంజూ శాంసన్‌కు విశ్రాంతి ఇవ్వడంతో భారత ఇన్నింగ్స్‌ను అభిషేక్ శర్మతో కలిసి వైభవ్ ఆరంభించనున్నాడు. ఈ సిరీస్‌లో వైభవ్ తనను తను నిరూపించుకుంటే భారత టీ20 జట్టులో అతడి స్దానం పదిలంగా ఉంటుంది. అయితే జింబాబ్వే గడ్డపై సూర్యవంశీ అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది.

వైభవ్‌ చెలరేగడం ఖాయం!
ఈ ఏడాది ఆరంభంలో జింబాబ్వే వేదికగా అండర్‌-19 ప్రపంచకప్‌లో వైభవ్ దుమ్ములేపాడు. ముఖ్యంగా ఫైనల్‌లో ఇంగ్లండ్‌పై అతడు విధ్వంసం సృష్టించాడు. కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు చేశాడు. ఇది యూత్ వన్డే చరిత్రలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఒకటిగా నిలిచిపోయింది.

ఈ చిచ్చర పిడుగు జింబాబ్వేలో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడి 169.49 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 439 పరుగులు సాధించాడు. ఇప్పుడు భారత సీనియర్ జట్టు తరపున కూడా అదే జోరును కనబరుస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. కాగా జింబాబ్వే పర్యటనలో భారత జట్టు ప్రధాన కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నాడు. వరుస సిరీస్‌లతో బీజీగా ఉండడంతో రెగ్యులర్ హెడ్‌కోచ్ గౌతమ్ గం‍భీర్‌కు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది.
చదవండి: వైభవ్ 'తరానికి ఒక్కడు'.. కాపాడుకోండి: సికందర్ రజా

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)