Breaking News

వైభవ్‌ సూర్యవంశీ విషయంలో మరో వివాదం!

Published on Wed, 06/17/2026 - 13:29

తొలిసారి భారత్‌- ‘ఎ’ జట్టు తరఫున బరిలోకి దిగిన ఐపీఎల్‌ స్టార్‌ వైభవ్‌ సూర్యవంశీ అంచనాలకు తగ్గట్లుగా రాణించలేకపోతున్నాడు. ప్రస్తుతం శ్రీలంక వేదికగా ముక్కోణపు వన్డే సిరీస్‌తో ఈ చిచ్చర పిడుగు బిజీగా ఉన్నాడు. ఇందులో భాగంగా శ్రీలంక- ‘ఎ’ జట్టుతో మ్యాచ్‌లో 12 బంతుల్లో మూడు  ఫోర్లు బాదిన వైభవ్‌ కేవలం 14 పరుగులు చేసి నిష్క్రమించాడు.

ఆ ఒక్క మ్యాచ్‌లోనే మెరుపులు
ఇక అఫ్గనిస్తాన్‌- ‘ఎ’తో మ్యాచ్‌లో మాత్రం ఫర్వాలేదనిపించాడు. 22 బంతులు ఎదుర్కొన్న ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ తొమ్మిది ఫోర్ల సాయంతో 44 పరుగులతో రాణించాడు. అనంతరం శ్రీలంక- ‘ఎ’తో వన్డేలో 21 పరుగులకే పరిమితమయ్యాడు. తాజాగా అఫ్గనిస్తాన్‌తో బుధవారం నాటి వన్డేలోనూ పదిహేనేళ్ల వైభవ్‌ సూర్యవంశీ మరోసారి నిరాశపరిచాడు.

పరుగుల ఖాతా తెరవకముందే.. 
ప్రియాన్ష్‌ ఆర్య (58)కు జోడీగా ఓపెనర్‌గా వచ్చిన వైభవ్‌.. 28 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 38 పరుగులు చేశాడు. నిజానికి ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ పరుగుల ఖాతా తెరవకముందే.. అవుటయ్యేవాడు. రెండో ఓవర్‌ రెండో బంతికి వైభవ్‌ ఇచ్చిన క్యాచ్‌ను అఫ్గన్‌ ఫీల్డర్‌ ఫరీదూన్‌ దావూద్జాయ్‌  గాల్లోకి ఎగిరిమరీ ఒంటిచేత్తో ఒడిసిపట్టాడు.

బతికిపోయిన బుడ్డోడు
దీంతో ఫీల్డ్‌ అంపైర్‌ అవుట్‌ ఇవ్వగా.. వైభవ్‌ మైదానం వీడేందుకు సిద్ధమయ్యాడు. అయితే, రీప్లేలో ఫ్రేమ్‌ బై ఫ్రేమ్‌ గమనించినపుడు బంతిలోని కొంతభాగం నేలకు తాకినట్లుగా ఉందని చెబుతూ థర్డ్‌ అంపైర్‌ వైభవ్‌ను నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో అఫ్గనిస్తాన్‌ ప్లేయర్లు తెల్లముఖాలు వేయగా.. వైభవ్‌కు లైఫ్‌ లభించింది.

అయినప్పటికీ వైభవ్‌ తన ఆట తీరును మార్చుకోలేదు. మూడో ఓవర్‌ నాలుగో బంతికి కూడా ఇలాగే అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకుని రెండో అవకాశం పొందాడు. కానీ 38 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఫరీదూన్‌ దావూద్జాయ్‌ బౌలింగ్‌లో ఖలీద్‌ తనీవాల్‌కు క్యాచ్‌ ఇచ్చి వైభవ్‌ వెనుదిరిగాడు. ఇక ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్‌ ఫైనల్‌ చేరే అవకాశం ఉంటుంది.

థర్డ్‌ అంపైర్‌ నిర్ణయంపై వివాదం
వైభవ్‌ విషయంలో థర్డ్‌ అంపైర్‌ తీసుకున్న నిర్ణయంపై సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు వస్తున్నాయి. స్పష్టంగా అవుట్‌ అని తెలిసినా.. థర్డ్‌ అంపైర్‌ పదే పదే పరిశీలించి ఆఖరికి వైభవ్‌కు అనుకూలంగా తీర్పునివ్వడం సరికాదని నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు. అదే సమయంలో వైభవ్‌ ఆట తీరును విమర్శిస్తూ.. ‘ ఎన్నో ఆశలు పెట్టుకున్నాం.. నువ్విక మారవా బుడ్డోడా’’ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా శ్రీలంకతోమ్యాచ్‌ సందర్భంగా వైభవ్‌ సహనం కోల్పోయిన సంగతి తెలిసిందే.

చదవండి: వైభవ్‌ వివాదం.. స్పందించిన బీసీసీఐ

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)