Breaking News

వైస్‌ కెప్టెన్‌గా ఎంపికైన వైభవ్‌ సూర్యవంశీ

Published on Wed, 07/29/2026 - 19:19

భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. జింబాబ్వే పర్యటనలో 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు అందుకున్న కొద్ది రోజులకే, భారత దేశవాళీ క్రికెట్‌లో ప్రతిష్ఠాత్మకమైన దులీప్ ట్రోఫీ 2026 కోసం ప్రకటించిన ఈస్ట్ జోన్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

కేవలం 15 ఏళ్ల వయసులోనే భారత జట్టులో చోటు సంపాదించిన వైభవ్ ఇప్పటివరకు ఎనిమిది ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడినా, భారత క్రికెట్ భవిష్యత్తు స్టార్‌గా గుర్తింపు పొందుతున్నాడు.

జూలై 29న ప్రకటించిన 15 మంది సభ్యుల ఈస్ట్ జోన్ జట్టుకు భారత వికెట్‌కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా ఎంపిక కాగా, వైభవ్ సూర్యవంశీకి వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు.

ఈ జట్టులో భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ, ముకేశ్ కుమార్, షాబాజ్ అహ్మద్, అభిమన్యు ఈశ్వరన్, అనుకుల్ రాయ్, విరాట్ సింగ్ తదితరులు కూడా చోటు దక్కించుకున్నారు.

దులీప్ ట్రోఫీ 2026 ఈస్ట్ జోన్ జట్టు: అభిమన్యు ఈశ్వరన్, సుదీప్ కుమార్ ఘరామి, షాబాజ్ అహ్మద్, సూరజ్ సింధు జైస్వాల్, మహ్మద్ షమీ, ముకేశ్ కుమార్, ఇషాన్ కిషన్ (కెప్టెన్), కుమార్ కుషాగ్ర, శిఖర్ మోహన్, అనుకుల్ రాయ్, విరాట్ సింగ్, సుభ్రాంశు సేనాపతి, వైభవ్ సూర్యవంశీ (వైస్ కెప్టెన్), దెనీష్ దాస్, అభిజిత్ సర్కార్.

స్టాండ్‌బై ఆటగాళ్లు: ఆయుష్ లోహరుకా, శ్రీదామ్ పాల్, సాంబిత్ ఎస్. బరాల్, శరణ్‌దీప్ సింగ్, స్వస్తిక్ సమల్.

కాగా, దులీప్‌ ట్రోఫీ ఆగస్ట్‌ 23 నుండి సెప్టెంబర్‌ 10 వరకు జరుగనుంది. 23నే ప్రారంభం కానున్న తొలి క్వార్టర్‌ ఫైనల్లో ఈస్ట్‌ జోన్‌ జట్టు నార్త్‌ ఈస్ట్‌ జోన్‌తో తలపడనుంది. ఆగస్ట్‌ 15 నుండి 27 మధ్యలో టీమిండియా శ్రీలంక పర్యటనలో రెండు టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడనున్నప్పటికీ.. టెస్ట్‌ జట్టులో ఇషాన్‌, వైభవ్‌కు చోటు దక్కని విషయం తెలిసిందే.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)