Breaking News

వైభ‌వ్ సూర్య‌వంశీకి బీసీసీఐ భారీ షాక్‌

Published on Wed, 06/17/2026 - 17:32

శ్రీలంక-ఎ జట్టు ప్లేయర్‌తో గొడవపడిన భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి భారీ షాక్ తగిలింది. అతడి మ్యాచ్ ఫీజులో బీసీసీఐ 50 శాతం కోత విధించింది. వైభవ్‌తో పాటు ఇండియా-ఎ జట్టు కెప్టెన్ తిలక్ వర్మపై కూడా 30 శాతం జరిమానా పడింది. 

మ్యాచ్ రిఫరీ ప్రదీప్ జయప్రగాష్ సిఫార్సుల మేరకు భారత క్రికెట్‌ బోర్డు ఈ కఠిన చర్యలు తీసుకుంది. లంక ఆటగాడు విషేన్ హలంబెజ్‌పై శ్రీలంక క్రికెట్ బోర్డు ఇప్పటికే సీరియస్ యాక్షన్ తీసుకుంది. అతడి మ్యాచ్‌లో కూడా 50 శాతం కోత విధించారు.

ఏమి జరిగిదింటే?
ముక్కోణపు సిరీస్‌లో భాగంగా జూన్‌ 15న దంబుల్లా వేదికగా భారత్‌-ఎ, శ్రీలంక-ఎ జట్లు తలపడ్డాయి. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌ 'సూపర్ ఓవర్'కు దారితీసింది. సూపర్ ఓవర్‌లో శ్రీలంక 'ఎ' జట్టు విజయం సాధించింది. 17 ప‌రుగుల టార్గెట్‌ను భార‌త్ చేధించ‌లేక‌పోయింది. అయితే సూప‌ర్ ఓవ‌ర్ ముగిసిన అనంత‌రం శ్రీలంక యువ ఆట‌గాడు విషేన్ హలంబెజ్ శృతిమించి ప్రవర్తించాడు. 

ఓట‌మి బాధ‌లో ఉన్న  వైభవ్ సూర్యవంశీ దగ్గరకు వెళ్లి.. “ఇక లగేజ్ సర్దుకుని ఇంటికి వెళ్ళు.. ఇది ఐపీఎల్ కాదు”  అని వ్యంగ్యంగా అన్నాడు. దీంతో స‌హ‌నం కోల్పోయిన వైభ‌వ్‌.. హలంబెజ్ వైపు దూసుకెళ్లి అతని ఛాతీపై బలంగా నెట్టాడు. లంక ఆటగాడు కూడా ప్రతిఘటించడంతో ఇద్దరి తీవ్ర వాగ్వ‌దం మొదలైంది. తోటి ఆటగాళ్లు జోక్యం చేసుకోవడంతో గొడవ సర్దుమణిగింది. 

అంతకుముందు వెలుతురు సరిగ్గా లేకపోయినప్పటికి అంపైర్లు సూపర్ ఓవర్ నిర్ణయించడం పట్ల భారత కెప్టెన్ తిలక్ వర్మ ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. సూపర్ ఓవర్ నిర్వహణ, నో-బాల్ కాల్స్ వంటి విషయాల్లో అంపైర్లతో తిలక్ వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలోనే తిలక్‌పై కూడా బోర్డు క్రమశిక్షణా చర్యలు చర్యలు తీసుకుంది.
చదవండి: అఫ్గానిస్తాన్‌ను చిత్తు చేసి.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్‌
 

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)