Breaking News

మా బౌల‌ర్‌ను చూసి టీమిండియా భ‌య‌ప‌డుతోంది: పాక్ మాజీ కెప్టెన్‌

Published on Sun, 02/15/2026 - 16:59

క్రికెట్ ప్ర‌పంచం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న భారత్‌-పాకిస్తాన్ మ్యాచ్‌కు మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. టీ20 ప్రపంచకప్‌-2026లో భాగంగా కొలంబో వేదికగా చిరకాల ప్రత్యర్ధులు అమీతుమీ తెల్చుకోనున్నారు. అయితే ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు ముందు పాక్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ హాట్ టాపిక్‌గా నిలిచాడు.

అత‌డి బౌలింగ్ శైలి భిన్నంగా అందుకు కారణం. బౌలింగ్ చేసే సమయంలో కొన్ని సెకన్లు ఆగి బంతిని విడుదల చేయడం అతడి స్పెషాలిటి. ఇప్పటివరకు భారత బ్యాటర్లు ఒక్కరు కూడా అతడి బౌలింగ్‌ను ఒక్కసారి కూడా ఎదుర్కొలేదు. దీంతో ఈ వరల్డ్‌కప్ మ్యాచ్‌లో అతడిని భారత బ్యాటర్లు ఎలా ఆడుతారో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఉస్మాన్ కోసం టీమిండియా బ్యాటర్లు ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మొహమ్మద్ హఫీజ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. మ్యాచ్‌ ప్రారంభానికి ముందే తారిక్‌ భారత్‌పై పైచేయి సాధించాడ‌ని హఫీజ్ అన్నాడు.

"ఉస్మాన్ తారిక్ ఇప్ప‌టికే భార‌త్‌పై సైకిలాజిక‌ల్‌గా విజ‌యం సాధించాడు. ప్ర‌త్యేక వ్యూహాలు ర‌చిస్తోంది. ప్రస్తుతం, బాబర్ అజామ్ లేదా మరెవరి గురించి ఎవరూ చ‌ర్చించ‌డం లేదు. మీడియా, ఫ్యాన్స్ అంతా తారిఖ్‌ గురించే మాట్లాడుతున్నారు. భారత డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా తారిఖ్‌ పట్ల ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.

అతడు పాకిస్తాన్ తరపున నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అయిన‌ప్ప‌టికి అత‌డిని ఎదుర్కొవ‌డానికి భార‌త్ ప్ర‌త్యేక వ్యూహాలు ర‌చిస్తోంది. ఈ మ్యాచ్‌లో ఉస్మాన్‌ను కెప్టెన్ స‌ల్మాన్ అఘా ఎలా ఉపయోగిస్తాడో చూడాలనుకుంటున్నాను. అత‌డిని 6వ ఓవర్‌లోనే రంగంలోకి దించితే బ్యాట‌ర్ల‌ను క‌ట్ట‌డి చేయ‌వ‌చ్చు" అని తప్మాడ్ అనే ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో హఫీజ్ పేర్కొన్నాడు.
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)