Breaking News

'గతంలో వచ్చిన రెండుసార్లు డ్రింక్స్‌ మోశాను.. సెంచరీ విలువైనది'

Published on Thu, 03/09/2023 - 21:40

అహ్మదాబాద్‌ వేదికగా టీమిండియాతో మొదలైన నాలుగో టెస్టులో తొలిరోజు ఆటలో ఆస్ట్రేలియా పూర్తిస్థాయిలో ఆధిపత్యం చూపింది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై ఆసీస్‌ బ్యాటర్లు మంచి బ్యాటింగ్‌ కనబరిచారు. టీమిండియా బౌలర్లు రోజంతా కష్టపడి నాలుగు వికెట్లు మాత్రమే తీయగలిగారు.  ఇక తొలిరోజు ఆటలో హైలైట్‌ అయింది మాత్రం నిస్సందేహంగా ఆస్ట్రేలియా ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా.

సిరీస్‌ ప్రారంభానికి ముందే ఆస్ట్రేలియా నుంచి ఈసారి తన ఆటతో ఎవరైనా భయపెడతారంటే ముందు వినిపించిన పేరు ఖవాజాదే. తాజాగా నాలుగో టెస్టులో ఖవాజా అద్భుత సెంచరీతో మెరిశాడు.  251 బంతుల్లో 104 పరుగులతో ఆడుతున్న ఖవాజా ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు ఉన్నాయి. అతను ఆడిన ఒక్క షాట్‌లో కూడా చిన్న పొరపాటు లేదంటేనే ఎంత గొప్ప బ్యాటింగ్‌ కొనసాగించాడో అర్థం చేసుకోవచ్చు.

ఖవాజా టెస్టు కెరీర్‌లో ఇది 14వ సెంచరీ కావొచ్చు.. కానీ టీమిండియాపై, భారత గడ్డపై ఇదే మొదటి శతకం కావడం విశేషం. అందునా భారత్‌ గడ్డపై సెంచరీ సాధించడం ఎంతో ఎమెషన్‌తో కూడుకున్నది. అందుకే తొలిరోజు ఆట ముగిసిన తర్వాత ఖవాజా మాట్లాడుతూ కాస్త ఎమెషన్‌ అయ్యాడు. ''గతంలో రెండుసార్లు భారత్‌ పర్యటనకు వచ్చినప్పుడు డ్రింక్స్‌ మాత్రమే మోశాను.. ఈసారి సెంచరీతో మెరిశాను.. అందుకే ఇది ఎంతో విలువైనది'' అని చెప్పుకొచ్చాడు.

"ఈ సెంచరీలో చాలా ఎమోషన్ ఉంది. దీని కంటే ముందు ఇండియాకు రెండుసార్లు వచ్చాను. మొత్తం 8 టెస్టుల్లోనూ డ్రింక్స్ మోశాను. ఈ వికెట్ చాలా బాగుంది. నా వికెట్ పారేసుకోకూడదని అనుకున్నాను. ఇది మానసిక యుద్ధం. మన అహాన్ని పక్కన పెట్టాలి. నాకు ఎలాంటి మూఢ నమ్మకాలు లేవు. కేవలం ఆడుతూ వెళ్లడమే" అని ఖవాజా చెప్పాడు.

ఇక తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 90 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఖవాజా 104 పరుగులు, గ్రీన్ 49 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ ఇద్దరూ కలిసి ఇప్పటికే ఐదో వికెట్ కు 85 పరుగులు జోడించారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరాలంటే కచ్చితంగా గెవాల్సిన పరిస్థితుల్లో ఉన్న టీమిండియా తొలి రోజే ఒత్తిడిలో పడింది.

చదవండి: ఇంగ్లండ్‌ను చావుదెబ్బ కొట్టిన బంగ్లా..

విమర్శలు వచ్చాయని 70, 80ల నాటి పిచ్‌ తయారు చేస్తారా?

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)