Breaking News

ఆసీస్ స్టార్ ఓపెనర్ అత్యంత చెత్త రికార్డు.. బుమ్రా స‌ర‌స‌న‌

Published on Wed, 06/11/2025 - 17:18

లార్డ్స్ వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో జ‌రుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా దారుణమైన ప్రదర్శన క‌న‌బ‌రిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఖాతా తెర‌వ‌కుండానే ఖ‌వాజా పెవిలియ‌న్‌కు చేరాడు. మార్న‌స్ ల‌బుషేన్‌తో క‌లిసి ఆసీస్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఖవాజా.. ప్రోటీస్ బౌల‌ర్ల‌ను ఎదుర్కొనేందుకు తీవ్ర ఇబ్బంది పడ్డాడు.

ఈ క్ర‌మంలో సౌతాఫ్రికా స్పీడ్‌స్టార్ క‌గిసో రబాడ బౌలింగ్‌లో స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి ఖ‌వాజా ఔట‌య్యాడు. ఇక ఈ మ్యాచ్‌లో డ‌కౌటైన ఖ‌వాజా ఓ చెత్త రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు. ఐసీసీ టోర్నీ ఫైన‌ల్లో అత్య‌ధిక డ‌కౌటైన ఆట‌గాడిగా జ‌స్ప్రీత్ బుమ్రా, తిల‌క‌ర‌త్నే దిల్షాన్, మెక‌ల్ల‌మ్‌ స‌ర‌స‌న నిలిచాడు.

బుమ్రా, దిలాన్ష్, మెక‌ల్ల‌మ్‌ ఐసీసీ ఈవెంట్ల ఫైన‌ల్లో రెండు సార్లు డ‌కౌట్ కాగా.. ఖవాజా సైతం స‌రిగ్గా రెండు సార్లు ఎటువంటి ప‌రుగులు చేయ‌కుండా ఔట‌య్యాడు. కాగా ఆస‌క్తిక‌రంగా డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ 2023లో కూడా ఖవాజా డ‌కౌట‌య్యాడు.

ఐసీసీ టోర్నీ ఫైనల్లో అత్యధిక సార్లు డకౌటైన ఆటగాళ్లు వీరే..
జస్ప్రీత్ బుమ్రా - 2
తిలకరత్నే దిల్షాన్ - 2
ఉస్మాన్ ఖవాజా - 2
బ్రెండన్ మెకల్లమ్ - 2
మొయిన్ అలీ - 1

కష్టాల్లో ఆసీస్‌..
కాగా ఫైన‌ల్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ బ్యాట‌ర్ల‌కు స‌ఫారీ పేస‌ర్లు చుక్క‌లు చూపిస్తున్నారు. ప్రోటీస్ బౌల‌ర్ల దాటికి కంగారులు కేవ‌లం 67 ప‌రుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డ్డారు. ఇప్ప‌టివ‌ర‌కు రబాడ, జానెసన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
చదవండి: IND vs ENG: టీమిండియాతో తొలి టెస్టు.. ఇంగ్లండ్ జ‌ట్టులోకి 19 ఏళ్ల యువ సంచ‌ల‌నం

 

 

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు