Breaking News

యూఎస్‌ఏ ప్రపంచకప్‌ జట్టులో వివాదాస్పద ఎంపికలు..?

Published on Thu, 01/01/2026 - 17:22

యూఎస్‌ఏ టీ20 ప్రపంచకప్‌ 2026 జట్టులో వివాదాస్పద ఎంపికలు జరిగినట్లు తెలుస్తుంది. సెలక్షన్ కమిటీ పాత్ర లేకుండా కోచ్ పుబుడు దసనాయకే, కెప్టెన్ మోనాంక్ పటేల్ అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారని సమాచారం. 

మెగా టోర్నీ కోసం జట్టును అధికారికంగా ప్రకటించనప్పటికీ.. పలువురు ఆటగాళ్లను సెలక్షన్ కమిటీ ప్రమేయం లేకుండానే ఎంపిక చేశారని ఓ అమెరికా సీనియర్‌ జర్నలిస్ట్‌ తెలిపారు.

స్థానికంగా జరిగే మేజర్‌ లీగ్‌ క్రికెట్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడకుండానే శ్రీలంక బ్యాటర్‌ షేహాన్ జయసూర్యకు నేరుగా ప్రపంచకప్‌ జట్టులో చోటు కల్పించారని తెలుస్తుంది. పాకిస్తాన్‌ మాజీ ఆటగాడు ఎహ్సాన్ అదిల్‌ను  కూడా అర్హత ప్రామాణాలు చూడకుండా జట్టులోకి తీసుకున్నారని సమాచారం.

యూఎస్‌ఏ హెడ్‌ కోచ్‌గా శ్రీలంక మాజీ ప్లేయర్‌ పుబుడు దసనాయకే బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలే తీసుకుంటున్నారని స్థానిక మీడియా అంటుంది. జట్టు ఎంపికలో కోచ్‌ పాత్రను పరిమితం చేయాలని జర్నలిస్ట్‌లు యూఎస్‌ఏ క్రికెట్‌ బోర్డుకు సూచిస్తున్నారు.

ప్రస్తుతం అందుతున్న లీకుల ప్రకారం.. భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న 2026 టీ20 ప్రపంచకప్‌ (ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8) కోసం ఎంపిక చేసిన 18 మంది సభ్యుల యూఎస్‌ఏ జట్టు ఇలా ఉంది. ఈ జట్టుకు కెప్టెన్‌గా మోనాంక్ పటేల్ వ్యవహరించనుండగా.. వైస్‌ కెప్టెన్‌గా జెస్సీ సింగ్‌ ఎంపికయ్యాడు.

మాజీ పాకిస్తాన్ ఆటగాడు ఎహ్సాన్ అదిల్, మాజీ శ్రీలంక బ్యాటర్‌ షేహాన్ జయసూర్య, లెగ్ స్పిన్నర్ మహ్మద్ మొహ్సిన్, మహారాష్ట్రలో (భారత్‌) జన్మించిన MLC స్టార్ శుభమ్ రంజనేమ తొలిసారి జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ జట్టుకు ఫాస్ట్ బౌలింగ్ మరియు అసిస్టెంట్ కోచ్‌ను నియమించినట్లు తెలుస్తుంది.

కోచ్‌ పుబుడు దసనాయకే ప్రోద్బలంతో మాజీ శ్రీలంక ఫాస్ట్ బౌలర్ దమ్మిక ప్రసాద్‌కు ఆ పదవి కట్టబెట్టారని సమాచారం.

టీ20 ప్రపంచకప్‌ 2026 కోసం ఎంపిక చేసిన యూఎస్‌ఏ జట్టు (లీకుల ప్రకారం)..
మోనాంక్ పటేల్ (కెప్టెన్), జెస్సీ సింగ్ (వైస్ కెప్టెన్), ఎహ్సాన్ అదిల్, ఆండ్రీస్ గౌస్, షయాన్ జహంగీర్, షేహాన్ జయసూర్య, ఆరోన్ జోన్స్, నోస్తుష్ కెన్జిగే, అలీ ఖాన్, సంజయ్ కృష్ణమూర్తి, మిలింద్ కుమార్, మహ్మద్ మొహ్సిన్, సాయి ముక్కమల్లా, సౌరభ్ నేత్రవల్కర్, శుభమ్ రంజానే, హర్మీత్ సింగ్, రుషిల్ ఉగర్కర్, షాడ్లీ వాన్ స్కాల్క్విక్.  

కాగా, 2026 టీ20 ప్రపంచకప్‌లో యూఎస్‌ఏ గ్రూప్‌-ఏలో ఉంది. ఈ గ్రూప్‌లో యూఎస్‌ఏతో పాటు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ టీమిండియా, పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌, నమీబియా జట్లు ఉన్నాయి. మెగా టోర్నీలో యూఎస్‌ఏ తమ తొలి మ్యాచ్‌లో (ఫిబ్రవరి  7) భారత్‌ను ఢీకొంటుంది. అనంతం ఫిబ్రవరి 10న పాకిస్తాన్‌, 13న నెదర్లాండ్స్‌, 15న నమీబియాతో పోటీపడనుంది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)